సైరా సినిమా తర్వాత బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు.దీంతో ప్రస్తుతం థియేటర్లలో చిన్న సినిమాల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో పోయిన వారం " ఎవ్వరికీ చెప్పొద్దు" అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాని క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్‌ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రె స్వీయ  నిర్మాణంలో  తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి ఒక ఆసక్తి నెలకొంది. 


ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబర్‌ 8న విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్ల నుండి ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. కొన్ని కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. దీంతో టాలీవుడ్ పెద్దలు  ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. టాలివుడ్ దిగ్గజ దర్శక నిర్మాతలు సినిమా బాగుందంటూ సొషల్ మీడియాలో సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు.


తాజాగా నిర్మాత అయిన లగడాపాటి శ్రీధర్ గారు ఈ సినిమా గురించి మాట్లాడారు. లగడపాటి గారు నిర్మాతగా మంచి మంచి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, పెళ్ళిచూపులు తర్వాత మళ్ళీ అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాతే కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా చాలా కొత్తగా ఉంది. చూస్తున్నంతసేపు మంచి అనుభూతినికి లోనయ్యాను.


నిర్మాతగా, హీరోగా రాకేష్ వర్రె సక్సెస్ అయ్యాడు.టెక్నీషియన్స్ ఈ సినిమాకు బలం. శంకర్ మంచి డైరెక్టర్. బాగా చదువుకున్నాడు. చాలా మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా రైటింగ్ చాలా బాగుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ నార్త్ అమ్మాయేమో అనుకున్నా. కానీ మన తెలుగమ్మాయే. చాలా బాగా చేసింది. ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుని నిర్మాతకి బాగా డబ్బులు రావాలని ఆశిస్తున్నానని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: