ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటూ 40 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ స్టేటస్‌ను బట్టి చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జులై 30న రావడం అసాధ్యం అనే అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు.   జక్కన్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రెస్ మీట్లో వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ అని పోస్టర్ మీద వేస్తే జనాలకు నమ్మకం కలగలేదు. 

మీడియా వాళ్లు అప్పటికప్పుడే పక్కాగా ఈ డేట్‌కు వస్తారా.. ఎప్పట్లాగే వాయిదానా అని మొహమాటం లేకుండా రాజమౌళిని అడిగేశారు.  అయితే ఆ రోజు జక్కన్న ధీమాగానే ఉన్నా... పక్కాగా ఆ డేటుకే వస్తామని ఒకసారి చెప్పి.. ఒకవేళ డేట్ మారినా 2020లో రావడం మాత్రం ఖాయం అని చెప్పాడు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు గాయాల పాలు కావడంతో ముందుగా అనుకున్న షెడ్యూల్స్ లేట్ అయినట్టు సమాచారం.  మరోవైపు రామ్ చరణ్.. సైరా సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రేక్ ఇవ్వడం కూడా ఈ సినిమా ఆలస్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు. 


వేరే కారణాల వల్లా కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో రాజమౌళి.. మరిన్ని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమా కోసం యాడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇది వరకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చూడని రీతిలో ఈ ఫైట్ సీన్స్ తీయబోతున్నట్టు సమాచారం.  దీనికి అదనంగా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.


 ఈ లెక్కన కనీసం మూడు నెలలు వృథా అయ్యాయని.. ఆ మేరకు సినిమాను వాయిదా వేయక తప్పదని చిత్ర వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.  కాబట్టి వచ్చే ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేసే లక్ష్యంతో కొత్తగా ప్రణాళికలు రచిస్తున్నారని.. దేశవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయడానికి దసరా సెలవులు మంచి టైమింగ్ అవుతుందని భావిస్తున్నారట. వచ్చే దసరాకు బాలీవుడ్ సినిమాలు ఏవైనా షెడ్యూల్ అయ్యాయేమో చూసుకుని ఈ చిత్రాన్ని దసరాకు ఖాయం చేయాలని చూస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: