తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 షో 87 వ రోజు దాటింది. ఇంటి సభ్యులు ఇక ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఒకరిని మించి మరొకరు గేమ్ ప్లే చేస్తున్నారు.  ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్, గేమ్స్ విషయంలో పోటాపోటీగా ఆడుతున్నారు.  టెలివిజన్ రంగంలో వినూత్న కార్యక్రమంలో ఇప్పటికీ బిగ్ బాస్ 1, 2 షోలకు మంచి ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే.  బిగ్ బాస్ 1 కి ఎన్టీఆర్, బిగ్ బాస్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు.  ప్రస్తుతం వస్తున్న బిగ్ బాస్ 3 కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 1, 2 కి వచ్చిన క్రేజ్ తో అందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కొంత మంది సెలబ్రెటీలే సైతం తమకు బిగ్ బాస్ లో చాన్స్ వస్తే మంచి పాపులారిటీ వస్తుందని భావించేవారు కూడా ఉన్నారు.

  ఇక జబర్ధస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయ్యాడు గెటప్ శీను.  గత ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో గెటప్స్ వేసిన శీను ప్రస్తుతం వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా తన అభిమానులతో  గెటప్ శీను మాట్లాడతూ..బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయమేంటని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. షో ప్రేక్షకులను బాగా అలరిస్తుందని.. మొదట్లో తనను కూడా షో కోసం సంప్రదించారని చెప్పాడు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్తే తాను ఎన్నో ప్రోగ్రామ్స్ నష్టపోవాల్సి వస్తుందని..ఒకవేళ బిగ్ బాస్ లోకి వెళ్లినా..ఏదో ఒకటి చేసి మొదటి వారమే ఎలిమినేషన్ అవుతానని అన్నాడు.

శుక్రవారం నాడు విడుదలైన 'రాజు గారి గది 3'లో గెటప్ శ్రీను ఓ పాత్ర పోషించాడు. ఆరు సంవత్సరాలు అవుతుంది కదా..మరి  'జబర్దస్త్' షోకి లీడర్ గా ఎందుకు చేయడం లేదు అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ..  'జబర్దస్త్', 'ఎక్స్ ట్రా జబర్దస్త్' షోలను ఒకరోజు గ్యాప్ తో షూట్ చేస్తారని.. అప్పట్లో 'జబర్దస్త్' టీమ్ లీడర్ గా ఉండడంతో.. ఆ తరువాత రోజు జరిగే 'ఎక్స్ ట్రా జబర్దస్త్' లో నటించడం కష్టమయ్యేదని చెప్పారు.  దాంతో టీమ్ లీడర్ గా వ్యవహరించడం లేదని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: