ఇంక మూడు వారాలలో తెలుగు బిగ్‌ బాస్ - 3 రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరుకుంది. పదహైదు మంది కంటెస్టంట్లతో మొదలైన బిగ్ బాస్ హౌస్‌లో పదమూడు వారాలు గడిచేసరికి ఏడూ మందే మిగిలారు. అయితే మూడో సీజన్‌లో సీరియల్స్, సినీ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ మందిని తీసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. 


తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయిన జబర్దస్త్ షో నుంచి ఎవర్నో ఒకరిని తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఈ సారి బజర్దస్త్ నుంచి ఎవరూ ఈ షోలో పాల్గొనలేదు. ఇంతక ముందు ఫస్ట్ సీజన్‌లో ధన్‌రాజ్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత వచ్చిన రెండు, మూడో సీజన్లలో ఒక్క జబర్దస్త్ యాక్టర్ కూడా లేరు. దీనికి గల కారణాన్ని జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తెలిపాడు.


ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బిగ్‌ బాస్ షో‌పై మాట్లాడాడు గెటప్ శ్రీను. మొదట్లో తనకు కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని కానీ తాను తిరస్కరించానని శ్రీను తెలిపాడు. బిగ్‌ బాస్ షో దాదాపు వంద రోజుల పాటు ఉంటుందని అన్ని రోజులు అక్కడే ఉంటే జబర్దస్త్ సహా ఇతర షోలు చేసేందుకు అవకాశం ఉండదని తెలిపాడు. అందుకే బిగ్ బాస్ షోకు వెళ్ళలేదు అన్న శ్రీను ఒక వేళ వెళ్లినా వారం కంటే ఎక్కువ రోజులు ఉండే వాడిని కాదని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం బిగ్ బాస్ షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోందని ప్రేక్షకులను బాగానే అలరిస్తోందని అభిప్రాయపడ్డాడు జబర్డ్స్ గెటప్ శ్రీను. ఇంక మూడు వారాలలో ముగిసే తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ లో ఎవరు గెలుస్తారని ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. చూడాలి ఇంక పదహైదు రోజులలో ముగిసే ఈ రియాల్టీ షోలో విజయం ఎవరిని వరిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: