బిత్తిరి సత్తి అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది తీన్మార్ వార్తలు. తీన్మార్ వార్తల రంగంలో బాగా మంచి మంచి పాపులర్ అయిన వ్యాఖ్యాత బిత్తిరి సత్తి.
బిత్తిరి సత్తి చాలా ప్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఓ వైపు వార్తా ఛానెళ్లలో తనదైన రీతిలో వార్తలు చదువుతూనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు బిత్తిరి సత్తి. కొంత కలం నుంచి చిన్న చిన్న కామెడీ పాత్రలు చేసిన బిత్తిరి సత్తి, ఇప్పుడు మాత్రం హీరోగా ప్రజల ముందుకు రాబోతున్నాడు.
బిత్తిరి సత్తి హీరోగా చేస్తున్న సినిమా పేరు ‘తుపాకి రాముడు’. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం సెన్సేషనల్ స్టార్
విజయ్ దేవరకొండ విడుదల చేయడం జరిగింది. సినిమాలో
బిత్తిరి సత్తి పాత్ర ఎలా ఉండబోతుందో ఈ టీజర్ ద్వారా ప్రేక్షకులకు తెలియచేస్తున్నారు.
బిత్తిరి సత్తి మ్యానరిజం, ఓ రెండు డైలాగులు టీజర్లో చూపించడం జరిగింది. టీజర్ అయితే అంత ఆసక్తికరంగా ఏమీ లేదు అని సమాచారం వినిపిస్తుంది.
అప్పుడెప్పుడో వచ్చిన
అలీ ‘పిట్టలదొర’ సినిమాలో చెప్పిన డైలాగును ఈ ‘తుపాకి రాముడు’లో
బిత్తిరి సత్తి తిప్పి తన స్టైల్లో చెప్పడం జరిగింది. ఆ తరవాత సోషల్ మీడియా గురించి ఒక సెటైర్ కూడా వేయడం టీజర్లో ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ టీజర్లో ప్రత్యేకత ఏమి పెద్దగా లేదనే చెప్పాలి.
కానీ, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు అని సమాచారం వస్తుంది. అంటే, సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంది అని అర్థమవుతోంది. అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టి.
ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం చేశారు. రసమయి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వహించారు. ప్రియ హీరోయిన్ పాత్ర పోషించింది.