సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం "రాగల 24 గంటల్లో". శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం  డి ఐ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నవంబరులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.  కాగా ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రగు కుంచె, పాటల రచయిత శ్రీమణి, మాటల రచయిత కృష్ణభగవాన్,  నటుడు రవి వర్మ, కెమెరామెన్ అంజి, లైన్ ప్రొడ్యూసర్ యమ్ యస్ కుమార్, చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ఢమరుకం సినిమానుండి శ్రీనివాస్ రెడ్డి గారితో మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటినుంచి ఆయన మా ఫ్యామిలీ లో ఒక మెంబర్ అయిపోయారు. మంచితనానికి మారుపేరు ఆయన. ఈ ప్రమోషనల్ సాంగ్ నేను రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్, ట్రయిలర్ చూశాను.. చాలా చాలా బాగుంది. ఒక సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరిది. దానివల్ల నిర్మాతకు చాలా హెల్ప్ అవుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి సినిమా చేశారు. ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ముఖ్యంగా నిర్మాత శ్రీనివాస్ కానూరు గారు మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాత. అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుంది.  ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రమోషనల్ సాంగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ దేవిశ్రీప్రసాద్. అడగ్గానే దేవి వచ్చి మా సాంగ్ లాంచ్ చేసినందుకు థాంక్స్. రగు కుంచె చాలా ట్రెండీగా ఈ పాటని కంపోజ్ చేశారు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. అందరూ గర్వపడే విధంగా సినిమా చేశాను. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రగు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. నన్ను నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచిగల నిర్మాత. ప్యాషన్ తో ఈ సినిమాని కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: