సాధారణంగా ఐటమ్ సాంగ్స్ గ్లామర్ ఎక్స్ పోజ్ చేసే హీరోయిన్స్ పై తీస్తారు. అయితే దీనికి భిన్నంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురంలో’ మూవీలోని ఒక పార్టీ సాంగ్ లో బ్రహ్మీ చేత ఒక స్పెషల్ సాంగ్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో బ్రహ్మానందంకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. 

దీనికితోడు ఆ మధ్య ఆయనకు అనారోగ్య సమస్యలు కూడ రావడంతో చాలామంది అతడిని పక్కకు పెట్టేస్తున్నారు. అయితే ‘వాల్మీకి’ మూవీలో గెస్ట్ పాత్రలో కొద్ది సేపు కనిపించిన బ్రహ్మీ ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ ప్రోత్సాహంతో ఒక పార్టీ సాంగ్ లో ‘అల వైకుంఠపురంలో’ నటిచడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
తెలుస్తున్న సమాచారం మేరకు ఈపాట ఒక ఫ్యామిలీ పార్టీ సాంగ్ అని తెలుస్తోంది. చాల సరదాగా జోష్ గా సాగే ఈపాటలో బ‌న్నీ పూజా ట‌బు శుశాంత్‌ ఇలా ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ఈపాట‌లో క‌నిపిస్తారు. అయితే ఈపాట‌కు లీడ్ మాత్రం బ్ర‌హ్మానందం తీసుకుంటాడు అని అంటున్నారు. ‘

ఈపాటలో తప్ప బ్రహ్మానందం ఈ మూవీలో మరెక్కడా కనిపించడు. ఈపాటలోని బ్రహ్మీ లుక్స్ అదేవిధంగా గెటప్ తో పాటు స్టెప్స్ కూడ చాల వెరైటీగా త్రివిక్రమ్ శ్రద్ధ పెట్టి డిజైన్ చేయించినట్లు సమాచారం. ఒకప్పుడు త్రివిక్రమ్ తీసే సినిమాలలో తప్పనిసరిగా కనిపించే బ్రహ్మీ ‘అజ్ఞాత‌వాసి’ ‘అర‌వింద స‌మేత’ చిత్రాలలో నటించలేదు. దీనితో వారి మధ్య ఎదో ఒక గ్యాప్ ఏర్పడింది అన్న వార్తలు వచ్చాయి. 

అయితే ఆ విషయాలను పక్కకు పెట్టి ఇప్పుడు త్రివిక్రమ్ తిరిగి బ్రహ్మానందం క్రేజ్ ఏర్పడేలా ఈపార్టీ సాంగ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’ సాంగ్ యూత్ కు బాగా కనెక్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ ప్రేక్షకులను అదేవిధంగా మాస్ ను ఆకర్షించేలా ఈపార్టీ సాంగ్ ఉంటుంది అని అంటున్నారు. ఈపాటను దీపావళి పండుగ సమయంలో విడుదలచేసి బ్రహ్మీ స్టెప్స్ కు సంబంధించిన రెండు సీన్స్ ను కూడ ఒక చిన్న వీడియోగా విడుదల చేసి ఈ మూవీ మ్యానియా పెంచడానికి త్రివిక్రమ్ ఆలోచనలలో ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: