టాప్ ఫోర్ సీనియర్ హీరోలు తెలుగులో మళ్ళీ బిజీ అవుతున్నారు. వీరంతా అరవై ఏళ్ళు దాటిన వారే కావడం విశేషం. అయితే వీరికి మంచి ఇమేజ్ ఉండడంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. పదేళ్ళ పొలిటికల్ లైఫ్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా వెండి తెరకు ఘన‌ స్వాగతం అనేశారు. ఈ నేపధ్యంలో ఆయన చేసిన రెండు సినిమాలు వరసగా వందకోట్లు సాధించి సూపర్ హిట్లు అయ్యాయి.


ఇపుడు చిరంజీవి 152వ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ కొరటాల డైరెక్షన్లో రాం చరణ్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకోనుంది. అయితే ఈ మూవీలో చిరు పక్కన నటించే హీరోయిన్ విషయమే ఇప్పటివరకూ ఫైనలైజ్ కాకపోవడం విశేషం. మెగాస్టార్ ఇమేజ్, ఆయన ఏజ్ ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకుంటే సరైన జోడీ ఎవరూ దొరకడంలేదు. ఇపుడున్న యంగ్ హీరోయిన్లు అసలు సరిపోవడం లేదు. దాంతో సెర్చింగ్ బీభత్సంగా సాగుతోంది.


చివరకి చేతిలో సినిమాలు లేని ఫ్లాప్ హీరోయిన్ త్రిషను ఎన్నుకోవాల్సివచ్చిందని అంటున్నారు. త్రిష వైపు నుంచి చూస్తే ఇది ఆమెకు బిగ్ ఆఫర్. అయితే చిరుని చూసే సినిమా ఆడాలి, గ్లామర్ ని ఆశించలేమని చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పేస్తోంది.  ఇక బాలయ్య విషయం తీసుకున్నా హీరోయిన్లు కొరత అలాగే ఉంది. ఆయన సైతం ఫేడౌట్ హీరోయిన్లతో, బీ గ్రేడ్ హీరోయిన్లతోనే మూవీస్ చేస్తున్నారు.


వెంకటేష్ కూడా ఇదే రకమైన బాధను అనుభవిస్తున్నారు. ఆయనకి సరిజోడి ఎవరూ దొరకడంలేదు. ఇక నాగార్జున తన గ్లామర్ ని చూపించి రకుల్ ని పక్కన పెట్టుకున్నా మన్మధుడు 2 తేడా కొట్టేసింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం హీరొయిన్ల కొరత సీనియర్లకు టాప్ లెవెల్లో ఉంది. మరి ఎవరిని పెట్టుకుంటారు, ఏం చేస్తారన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: