ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న టాప్ హీరోల సినిమాలు అన్నీ తమ సినిమాల రిలీజ్ కు సంబంధించి ఒక క్లారిటీకి వస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు క్రిస్మస్ సీజన్ కు వస్తూ ఉంటే మరి కొన్ని సంక్రాంతి సజన్ కు ఇంకా మిగిలి ఉన్న సినిమాలు ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్ డేకు షెడ్యూల్ అవుతున్నాయి. 

అయితే విజయ్ దేవరకొండ మాత్రం తాను నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ గురించి ఏమాత్రం ఖంగారు పడకుండా చాలాతీరికగా వ్యహరించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్యూర్ తో విజయ్ దేవరకొండ తన సినిమాల విషయంలో ఎటువంటి హడావిడి లేకుండా చాలా తీరికగా పూర్తి చేసి తన సినిమాకు ఎటువంటి పోటీలేని డేట్ గురించి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

దర్శకుడు కాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ స్క్రిప్ట్ లో చాల మార్పులు జరిగిన నేపధ్యంలో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయమై విజయ్ కి కూడ క్లారిటీ లేదు అని అంటున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరిలో కూడ విడుదల కాకపోతే ఆ తరువాత వచ్చే పరీక్షల సీజన్ పూర్తి అయ్యేదాకా విజయ్ వేచి ఉండవలసిన పరిస్థితి అని తెలుస్తోంది. 

దీనితో విజయ్ కు ‘డియర్ కామ్రేడ్’ చాల జ్ఞానోదయం చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ తాను సొంతంగా తరుణ్ భాస్కర్ ను హీరోగా చేసి నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీని చాలగట్టిగా ప్రమోట్ చేసి నిర్మాతగా సక్సస్ కావాలని చాల పట్టుదల పై ఉన్నాడు. ఈ మూవీ ఆర్ధికంగా విజయం సాధిస్తే ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూ మరొక వైపు నిర్మాతగా మరిన్ని సినిమాలు తీయాలని విజయ్ భారీ ప్రణాళికలు వేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: