ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు రిలీజ్ డేట్లపై,కొన్ని రోజులు నుండి  తీవ్ర చర్చలు కొనసాగుతూ వస్తున్నాయి.అతి ముఖ్యంగా,ఇదివరకు లానే  సంక్రాంతి టైములో బాక్స్ ఆఫీస్ వద్ద,భారీ స్థాయి లో పోటీ కొనసాబోతుంది.మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు',అల్లు అర్జున్  'అల వైకుంఠపురములో' సినిమాలు జనవరి 12 న,సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి.అటు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన  ఎంత మంచివాడవురా కూడా సంక్రాంతి టైములో రిలీజ్ చేయాలని ఉన్నా,ఇప్పుడు ఉన్న పోటీతో పోల్చి  చూడగా,ఆ సినిమాను ఒక్క వారం వెనక్కు జరిపే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న పెద్ద సినిమాల డేట్లు ఫిక్స్ అయిపోయాయి,కాబట్టి మీడియం రేంజ్ ఉన్నమూవీ రిలీజ్ డేట్లు కూడా ప్లాన్ చేస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమా,డిసెంబర్ 20 న రిలీజ్ కానుంది. అలాగే రవితేజ డిస్కోరాజా,నితిన్  భీష్మ సినిమాలు డిసెంబర్ నెలలో, క్రిస్మస్ సీజన్ టైములో రిలీజ్  అవుతాయని మొదట్లో వార్తలు వచ్చాయి,కానీ ఇప్పుడు  పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది అంటున్నారు.

రవితేజ డిస్కోరాజా,రిపబ్లిక్ డే నాడు,మరియు నితిన్ భీష్మ వాలెంటైన్స్  డేకి ఖరారు చేసారని  అంటున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల నిర్మిస్తున్న నాగచైతన్య,రష్మిక నటించిన సినిమాను తొలుత,క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసారు కానీ,షూట్ డిలే అవ్వటంతో ఈ మూవీ కూడా వాలెంటైన్స్  డే నాటికీ మార్చారని తెలుస్తుంది.దీంతో  ప్రస్తుతం డిసెంబర్ లో క్రిస్మస్  సీజన్లో పెద్దగా పోటీ లేదు అంటున్నారు.

 బాలయ్య సినిమా రూలర్ కూడా సంక్రాంతి  అప్పుడు రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి కానీ,ఇప్పుడు రూలర్ క్రిస్మస్ సీజన్లోనే  రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. డిసెంబర్ నెలాఖరుకు సినిమా రిలీజ్ కావచ్చు అని అంటున్నారు. ఇక వెంకటేష్,నాగచైతన్యల మల్టిస్టారర్ మూవీ వెంకీమామ డేట్ పై ఇంకా పూర్తి క్లారిటీ లేదని,త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చాక,ప్రకటన చేస్తామని మీడియాతో చెప్పారు యూనిట్ సభ్యులు.


మరింత సమాచారం తెలుసుకోండి: