నాగచైతన్యకు ఇంకా నిజ జీవితంలో పిల్లలు పుట్టకపోయినా అతడి స్క్రీన్ డాటర్ హీరోయిన్ గా మారబోతోంది. ‘మజిలీ’ సినిమాలో చైతన్యకు కూతరుగా నటించిన అనన్య అగర్వాల్ ఇప్పుడు కేవలం 16 సంవత్సరాల వయసుకే హీరోయిన్ గా మారబోతు ఉండటం హాట్ న్యూస్ గా మారింది. 9 సంవత్సరాల వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె అనేక హిందీ సీరియల్స్ లో నటించింది. 

అంతేకాదు అనేక సోప్స్ కంపెనీలకు ఈ అమ్మాయి వారి ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈమెను బెల్లంకొండ సురేశ్ తమ్ముడు గణేష్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తొలి మూవీలో ఈ బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

‘బ్రోచేవారెవరురా’ మూవీని తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ మూవీకి ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఒక టీన్ ఏజ్ అమ్మాయి అబ్బాయి చుట్టూ తిరిగే ఈ కథకు అన్ని విధాల అనన్య అగర్వాల్ సరిపోతుందని ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత చాల ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈమె రాకతో కొంత పరిష్కారం దొరుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 

‘మజిలీ’ మూవీలో చైతన్య కూతురుగా భావోద్వేగాలను పలికించడమే కాకుండా చాల చలాకీగా నటించిన ఈ యంగ్ బ్యూటీ పాత్ర ‘మజిలీ’ సినిమాకు బాగా కీలకంగా మారి విమర్శకుల ప్రశంసలు కూడ పొందింది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ తమ చదువు పూర్తి చేసుకుని 20 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే ఫిలిం ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ కు భిన్నంగా అనన్య తన చదువును బ్రేక్ చేసుకుని హీరోయిన్ గా మారడంతో మళ్ళీ పాత్ర ట్రెండ్ మొదలైంది అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: