తమిళ సూపర్ స్టార్ రజినీకాంతో లింగ మూవీ నుంచి వరుస బెట్టి సినిమాలు తీస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా రజినీ ఇమేజ్ తో ఆయన నటిస్తున్న సినిమాలు కలెక్షన్ల పరంగా నాట్ బ్యాడ్ అనిపించుకుంటున్నాయి. కాకపోతే అప్పట్లో లింగ్ సినిమా ఆర్థికంగా బయ్యర్లకు ఇబ్బందులు కలిగింది. తర్వాత వచ్చి కబాలి, కాలా, పెట్టా మూవీస్ కమర్షియల్ హిట్ కాకపోయినా..కలెక్షన్ల పరంగా ఒకే అనిపించుకున్నాయి. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో రజినాకాంత్ నటటిస్తున్న ‘దర్భార్’ మూడా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.
ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. ఈ మూవీలో రజినీ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారట. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, అంతా ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రజనీ 'ఆదిత్య అరుణాచలం' అనే పాత్రలో కనిపించనున్నట్టు నివేద థామస్ చేసిన ఒక ట్వీట్ వలన తెలుస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలు, షూటింగ్ లోకేషన్స్ లీక్ అయ్యాయి. అందులో కొన్ని చోట్ల డాన్ గా, కొన్ని ఫోటోల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు రజినీకాంత్.
అయితే ఈ మూవీలో నాని హీరోయిన్ నివేద థామస్, రజినీ కూతురు గా కనిపించబోతుందట. దానికి తగ్గట్టుగానే ఈ అమ్మడు తాజాగా ఓ ట్విట్ చేసింది. 'ఒకే ఒక్కడి గురించి ఈ ప్రపంచం తెలుసుకోవలసిన సమయం వచ్చింది .. ఆయనే మా నాన్న .. ఆదిత్య అరుణాచలం' అంటూ 'దర్బార్ ' సినిమాలో రజనీ పాత్ర పేరును రివీల్ చేసింది. గతంలో రజినీకాంత్ నటించిన ‘అరుణాచలం’ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ‘అరుణాచలం’తో రజనీకాంత్ మాస్ ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశారు. ఆ పేరుని గుర్తు చేస్తూ ఆయన మరోసారి అలరించబోతున్నారు.
And now for the world to know!
— Nivetha Thomas (@i_nivethathomas) October 18, 2019
There is and will only be ONE #AadityaArunachalam
And he, is MY Appa.
Watch! Out!#Darbar 🔥