మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ధ కాలం పైగా తెలుగు తెర మీద తన అంద చందాలతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోలు అందరితో జోడీ కట్టిన తమన్నా ప్రస్తుతం కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు కనిపిస్తున్నా సరే వస్తున్న అర కొర అవకాశాలతో కాలం వెళ్లదీస్తుంది. అయితే ఈమధ్య ఓ సినిమాలో తమన్నా నటించకపోయినా సరే తమన్నా పేరు చెప్పుకుని ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.


అదెలా అంటే యాంకర్ కం డైరక్టర్ కం ప్రొడ్యూసర్ ఓంకార్ తీసిన రాజు గారి గది 3 సినిమా ఈమధ్య రిలీజై టాక్ బాగా రాకున్నా సరే కామెడీ ఉంది కాబట్టి బి,సి సెంటర్స్ లో కలక్షన్స్ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయట. ఇదిలాఉంటే తమన్నాని వాడి ఈ సినిమా ప్రమోషన్స్ చేయడం వల్ల మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపించారు.


అసలు ఎందుకు తమన్నాని వాడుకున్నారు అంటే.. అసలు ఆ సినిమాలో అవికా గోర్ కు ముందు అనుకున్నది తమన్నానే. కాని డేట్స్ అడ్జెస్ట్ అవకపోవడంతో తమన్నా బదులుగా అవికా గోర్ వచ్చి ప్రాజెక్ట్ లో చేరింది. తమన్నా తో ముహుర్తం పెట్టుకుని సడెన్ గా ఆమె ప్లేస్ లో అవికా గోర్ ను పెట్టి సినిమా తీసి రిలీజ్ చేశాడు ఓంకార్. సినిమా అంతా రెండు నెలల్లో పూర్తి చేసి అవుట్ పుట్ రెడీ చేశాడు.


అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడకు వెళ్లినా అసలు తమన్నా ఎందుకు ఈ సినిమా చేయలేదని ప్రశ్న ఎదురవుతుంది. తమన్నా కావాలనే వెళ్లిందా.. లేక మీరు ఆమెను కావాలని తీసేశారా ఇలాంటి ప్రశ్నలని విన్న చిత్రయూనిట్ తమన్నా ప్రస్థావన తీసుకురాకుండా ప్రమోషన్స్ చేయడక్ కుదరట్లేదు. తమన్నా మాత్రం తనకు ఈ విధంగా పబ్లిసిటీ వచ్చేస్తుందని భావిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: