ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో అంటే వెంటనే అందరి నోటా వినిపించే పేర్లలో ముందు వినిపించే పేరు మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్న సమయంలో నెం.1 స్థానం కోసం మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటు పోటీ ఉండేది. కాని ఇప్పుడు మహేష్ బాబుకు గట్టి పోటీ లేదు. యంగ్ స్టార్ హీరోల్లో టాప్ హీరో.. సీనియర్ హీరోల కంటే కూడా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు స్టార్ డం ని సంపాదించుకున్నాడు. అలాంటి మహేష్ బాబు తనకు బన్నీ పోటీ వస్తాడని కాస్త భయపడుతున్నట్లు కామెంట్స్ పడుతున్నాయి. సంక్రాంతికి 'అల వైకుంఠపురంలో' సినిమాని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. బన్నీ సినిమా విడుదలవుతున్న రోజే సరిలేరు నీకెవ్వరు కూడా విడుదల చేయాలని నిర్మాతలను మహేష్ బాబు ఒత్తిడి చేస్తున్నాడట. 

సోలోగా బన్నీ సినిమా వస్తే తన సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందేమో అనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు ఇలా పోటీకి వస్తున్నాడంటూ కొందరు మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు అల వైకుంఠపురంలో సినిమాకు రెండు రోజుల ముందే సరిలేరు నీకెవ్వరు వస్తే వచ్చే కలిగే నష్టం ఏంటని మహేష్ బాబును నెటిజన్స్ సూటిగానే అడుగున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు రెండు కూడా ఒకే రోజు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో దీని గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రావడం కామన్. కాని ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రావడం అన్నది చాలా రేర్ అన్న విషయం అందరికి తెలిసిందే.

రెండు సినిమాలకు కనీసం 2-3 రోజుల గ్యాప్ పెట్టుకుని విడుదల చేసుకుంటే ఇద్దరికి బావుంటుంది. కాని మహేష్ మాత్రం అదే తేదీని ఎందుకు అనుకుంటున్నాడో అర్థం కావడం లేదని సినీ వర్గాల వారు కూడా మాట్లాడుకుంటున్నారట. ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా తేదీని మార్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. కాని మహేష్ మాత్రం నిర్మాతలకు ముందే.. అస్సలు తగ్గవద్దని సూచించాడంటూ ఇన్‌సైడ్ టాక్. ఇద్దరు కూడా తగ్గక పోవడంతో రెండు సినిమాలకు కూడా నష్టం తప్పదని అటు నిర్మాతలు, ఇటు బయ్యర్లు టెన్షన్ పడుతున్నారట. మరి ఇప్పటికైనా ఒకరు కాంప్రమైజ్ అయి డేట్ మార్చుకుంటే బావుంటుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: