బాలీవుడ్ ఇండస్ట్రీ బడా బడా హీరోలు వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్ లు మరియు స్టోరీలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సందర్భంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పోకిరి సినిమా నీ బాలీవుడ్లోకి వాంటెడ్ గా రీమేక్ చేసి అద్భుతమైన హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మరియు అదే విధంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కూడా గజిని సినిమాతో వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో సౌత్ సినిమా ని నమ్ముకుని మంచి హిట్ అందుకున్నాడు.


ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా తెలుగులో తీసిన అర్జున్ రెడ్డి సినిమా అని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ఆ సినిమా ద్వారా కెరియర్లో నిండా మునిగిపోయిన షాహిద్ కపూర్ అద్భుతమైన హిట్ అందుకున్నాడు. దీంతో సౌత్ సినిమాల్లో ఏదైనా బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల అవుతున్నాయి అంటే ఆ సినిమాలకు మంచి డిమాండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్ కావటం మరియు అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందడంతో సౌత్ సినిమాలకు మరియు సౌత్ డైరెక్టర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.


ఈ క్రమంలో తాజాగా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని సినిమాని బాలీవుడ్ లోకి షాహీద్ కపూర్ రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. మరియు అదే విధంగా దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమా 2010లో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇదే చిత్రాన్ని దేవ కట్టా హిందీలో అదే టైటిల్ తో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌దత్ నటించడమే కాకుండా స్వయంగా నిర్మించారు కూడా. ఇలా సౌత్ సినిమాలు నార్త్ లో హవా చూపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: