ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తమను కలవడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. బాలీవుడ్ ప్రముఖులందర్నీ పిలిచి... ఓ కార్యక్రమం నిర్వహించి... తమతో చర్చించడం మంచి సందేశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఖాన్... ట్వీట్ ద్వారా తెలిపాడు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.


మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ... గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు అమీర్‌ఖాన్‌కు థాంక్స్ చెప్పారు. అదే సమయంలో... మహాత్మాగాంధీ సిద్ధాంతాల్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషిని అమీర్‌ఖాన్‌ అభినందించారు.ఇకపై సినిమాల్లో గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాల్ని కూడా ప్రచారం చేస్తామని షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ హామీ ఇచ్చారు. ఇలాంటి అవకాశాన్ని తాము వినియోగించుకుంటామని, బాలీవుడ్ సినిమాని ప్రపంచవ్యాప్తం చేస్తామని షారూఖ్ అన్నారు.


ఈ సందర్భం గా మోడీ మాట్లాడుతూ  "సృజనాత్మకత యొక్క శక్తి అపారమైనది మరియు మన దేశానికి ఈ సృజనాత్మకత స్ఫూర్తిని ఉపయోగించడం చాలా అవసరం. మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలను ప్రాచుర్యం పొందేటప్పుడు చలనచిత్రాలు మరియు టెలివిజన్ ప్రపంచం  లో  చాలా మంది గొప్ప గా  పని చేస్తున్నారు. ”


ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ, “సృజనాత్మక వ్యక్తులుగా మనం చేయగలిగేది చాలా ఉంది. ఇంకా ఎక్కువ చేస్తామని నేను ప్రధానికి భరోసా ఇస్తున్నాను. ” షారూఖ్ ఖాన్ ఇలా అన్నారు,“ మనందరినీ ఒకచోట చేర్చుకున్నందుకు నేను ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అది కూడా ఇలాంటి కారణాల వల్ల. భారతదేశానికి మరియు ప్రపంచానికి గాంధీజీని తిరిగి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. "


మరింత సమాచారం తెలుసుకోండి: