గ్లామర్ ఎక్స్ పోజింగ్ నుండి నటన వరకు ఎలాంటి పాత్రను అయినా నటించి మెప్పించే తాప్సీ ‘సౌండ్ కీ ఆంఖ్’ లో 60 ఏళ్ళ వృద్దురాలుగా కనిపించి మెప్పించింది. ప్రస్థుతం తెలుగు సినిమాలకు దూరమైనా తాప్సీ బాలీవుడ్ లో వరస పెట్టి సనిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. 

తన కెరియర్ లో ఎన్నో తప్పులు చేసినా తాను సంతోషంగానే ఉన్నాను అంటూ కేవలం గ్లామర్ ఎక్స్ పోజ్ చేసే నాలుగు పాటలు ఉండే సినిమాలు చేసి గతంలో తాను చాల నష్టపోయాను అని తాప్సీ అంటోంది. వైవిధ్యభరితమైన కథలలో నటించినప్పుడు మాత్రమే ఏ ఆర్టిస్టుకు అయినా పేరు వస్తుంది అన్న విషయం తాను జీవితంలో చాల ఆలస్యంగా తెలుసుకున్నాను అని అంటోంది. 

ఇదే సందర్భంలో ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడ చేసింది. ప్రభాస్ రజినీకాంత్ కమలహాసన్ లు నటించే సినిమాలు అన్ని భాషలలోను విడుదల చేస్తారనీ మరి అలాంటి అవకాశాలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ఎందుకు ఇవ్వరు అంటూ తాప్సీ ప్రశ్నిస్తోంది. ఇండియన్ సినిమా సెలెబ్రెటీగా ఎదగగల శక్తి హీరోలకు తప్ప హీరోయిన్స్ కు లేదా అంటూ కామెంట్స్ చేస్తోంది. 

ఇదే సందర్భంలో హీరోయిన్స్ పారితోషికం గురించి మాట్లాడుతూ హీరోలతో సమానంగా హీరోయిన్స్ కు కూడ పారితోషికాలు పెరగాలి అంటే హీరోయిన్స్ మార్కెట్ పెరగడమే కాకుండా కేవలం హీరోయిన్స్ కోసమే ధియేటర్స్ కు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య పెరగాలని అప్పటి వరకు హీరోయిన్స్ కు హీరోలతో సమానంగా పారితోషికాలు ఇవ్వరు అంటూ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో తప్పుల గురించి మాట్లాడుతూ హీరోలు తప్పులు చేసినా జనం పట్టించుకోరనీ అదే ఒక హీరోయిన్ తప్పులు చేస్తే విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వెంటనే వస్తాయి అంటూ ఇంకా ఇండియాలో స్త్రీల పై వివక్షత కొనసాగుతూనే ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: