తళుకు బెళుకు తార తమన్నా. మిల్కీ బ్యూటీ తమన్నా. దాదాపుగా మూడు పదులకు చేరువ అవుతున్నా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికీ నాటౌట్ అంటోంది. అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ అమ్మడికి దాంతో పాటు తెలివి కూడా చాలా ఎక్కువేనని అంటారు. ఇక లౌక్యం కూడా జత కలవడంతో ఎక్కడ ఎలా ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న వాటి విషయంలో డాక్టరేట్ కూడా  చేసిన తమన్నాకు అవకాశాలు రాకుండా పోతాయా.


ఇవన్నీ ఇలా ఉంటే తమన్నా తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. తనకు మీటూ అవసరం పడలేదని చెప్పుకొచ్చింది. మహిళలు లైంగికంగా కానీ ఇతరత్రా కానీ వేధింపులు ఎదురైతే వాటిని చెప్పుకునే బహు చక్కని ఫ్లాట్ ఫారం మీటూ అని కూడా అంది. అయితే తన మొత్తం కెరీర్లో ఆ ఇబ్బందులు లేవని తమన్నా చెప్పడం విశేషం.


తన కెరీర్లో లైంగికంగ వేధించాలను చూసిన వారు, ఇబ్బందులు పెట్టాలని చూసిన వారు ఎవరూ లేరని చెప్పిన తమన్నా దానికి తన ప్రవర్తన  కూడా ప్రధాన‌ కారణం అని చెప్పింది. తాను ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలో తెలుసుకున్న దానినని అంటోంది. బహుశా ఈ కారణంగానే తనకు అటువంటి  ఇబ్బందులు తప్పాయని ఆమె చెబుతోంది.


ఇక లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఆత్మ స్థైర్యంతో నిబ్బరంగా ఉండాలని, ధైర్యంగా ముందుకువచ్చి అన్ని విషయాలు చెప్పాలని ఆమె కోరింది. వారి మీద ఫిర్యాదు కు గురి అయిన వారి నుంచే కాకుండా  సమాజం నుంచి కూడా వత్తిళ్ళు ఉంటాయని చెప్పిన తమన్నా వాటిని డేరింగ్ గా ఎదుర్కోవాలని సూచింది. తన వరకూ తనకు హాపీగా కెరీర్ సాగుతోందని చెప్పిన తమన్నా మరిన్ని తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తోందిపుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: