మన భాష సినిమా ఎక్కడ కనిపించినా సరే ఇది మన సినిమా అన్న ఫీలింగ్ ఉంటుంది. అయితే ఫారిన్ లో తెలుగు సినిమాలకు ఏర్పడుతున్న క్రేజ్ కు అక్కడ ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక బాహుబలి సినిమాతో ఏ తెలుగు సినిమాకు రాని కొన్ని అవార్డులు, రివార్డులతో పాటుగా ప్రత్యేకమైన ప్రదర్శనలు జరిగాయి.. జరుగుతున్నాయి.


లేటెస్ట్ గా లండల్ లోని రాయల్ ఆల్ బర్ట్ హాల్ లో బాహుబలి ప్రదర్శన అక్కడ ప్రేక్షకులను అలరించింది. 1987లో మొదలైన రాయల్ ఆల్ బర్ట్ హాల్ లో ఒకేసారి 5250 సినిమా చూసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగిన ఈ థియేటర్ లో కేవలం ఇంగ్లీష్ సినిమాలే ప్రదర్శించబడతాయి. 


ఇప్పుడు బాహుబలి సినిమాకు ఆ ప్రత్యేక అవకాశం వచ్చింది. బాహుబలి సినిమా రాయల్ ఆల్ బర్ట్ హాల్ లో ప్రదర్శితమనని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అయితే ఆరోజు రానే వచ్చింది. శనివారం అక్కడ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు చిత్రయూనిట్ అటెండ్ అవడం జరిగింది. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్కతో పాటుగా సినిమా నిర్మాతలు హాజరయ్యారు.


అయితే రాయల్ ఆల్ బర్ట్ లో తెలుగు సినిమా ప్రదర్శితమవుతుందన్న వార్తల్ తెలిసిన లండన్ లోని తెలుగు ప్రేక్షకులు అధిక సంఖ్యలో అక్కడకు వచ్చారట. సినిమా ప్రారంభం నుండి ఎండ్ వరకు ఈలలు, గోలలతో రచ్చ రచ్చ చేశారని తెలుస్తుంది. మొత్తానికి అనుకున్న దాని కన్నా రాయల్ ఆల్ బర్ట్ హాల్ లో బాహుబలి ప్రదర్శన సక్సెస్ అయిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా కీరవాణి లైవ్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నదులు దాటి వెళ్లినా సరే తెలుగు సినిమా మీద మన వాళ్లు చూపిస్తున్న అభిమానం అంతా ఇంతా కాదని మరొక్కసారి తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: