మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నో ఏళ్లుగా  వివాదాలు రగులుతూనే ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కొత్త అధ్యక్షులు ఉపాధ్యక్షులు వచ్చిన తర్వాత మా అసోసియేషన్ లో వివాదాలు  కాస్త  సద్దుమణిగాయి అనుకుంటున్న తరుణంలో... మరోసారి మా అసోసియేషన్ వివాదాలు తెర మీదికి వచ్చాయి. మా అధ్యక్షుడైన నరేష్  ఉపాధ్యక్షుడు అయిన రాజశేఖర్ రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. అయితే నేడు మా అసోసియేషన్ అధ్యక్షుడు అయిన నరేష్ కు తెలియకుండానే మా అసోసియేషన్ బాడీ మీటింగ్ నిర్వహించారు ఉపాధ్యక్షుడు రాజశేఖర్, సెంట్రల్ సెక్రటరీ జీవితారాజశేఖర్. దీంతో ఈ సమావేశం మా అసోసియేషన్ లో సంచలనంగా మారింది. 

 

 

 

 ఈ సమావేశంలో జీవితా రాజశేఖర్ వర్గంపై నరేష్ వర్గం మాటల దాడి చేయడంతో సమావేశం రసాభాసగా సాగింది. అయితే ఇప్పటికే మా అసోసియేషన్ కి అధ్యక్షులు మారుతున్నప్పటికీ.... మా అసోసియేషన్ లో ఉన్న సభ్యుల తీరు మాత్రం మారడం లేదని  పలువురు  విమర్శలు గుప్పించారు. ఇక మా అసోసియేషన్ ఈసీ మెంబర్ అయినా కమెడియన్ పృథ్వి కూడా ఈసీ మెంబెర్ గా  గెలిచినందుకు సంతోషపడ్డాలో  లేక మా అసోసియేషన్ సభ్యుల తీరు చూసి బాధపడాలో  తెలియటం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రముఖ రచయిత నటుడు పరుచూరి గోపాలకృష్ణ మా అసోసియేషన్ సమావేశం నుండి కన్నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. 

 

 

 

 

 అయితే ఈ వార్తలపై స్పందించిన పరుచూరి గోపాలకృష్ణ ఈ వార్తలను ఖండించారు. తను కన్నీళ్లు పెట్టుకుని మా అసోసియేషన్ సమావేశం  నుంచి బయటకు వెళ్లి పోలేదని... సమావేశంలో కొందరు సభ్యుల తీరు నచ్చకే బయటకు వెళ్లిపోయానని ఆయన తెలిపారు. అయితే మా అసోసియేషన్ అధ్యక్షులు నరేష్ లేకుండా   బాడీ మీటింగ్ నిర్వహించడంతో  మా అసోసియేషన్ సభ్యులు కొందరు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: