తెలుగుసినిమాలు ఏడాదికి వందకు పైగా రిలీజ్ అవుతాయి. ఇక ప్రతీ సీజన్ని అసలు మిస్ కాకుండా రిలీజ్ కొడతారు. సంక్రాంతి వచ్చిందంటే పూనకమే వచ్చేస్తుంది.సంక్రాంతికి పోటీలు పడి మరీ సినిమాలు విడుదలకు ఎగబడతారు. గట్టిగా చూస్తే పది రోజులు కూడా సెలవులు ఉండవు. దసరా సీజన్ కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. రిలీజ్ కోసం సినిమాలు రెడీ చేసి పెట్టుకుంటారు.


మరి అటువంటిది దీపావళి సీజన్ని మాత్రం ఎందుకో వదిలేస్తున్నారు. బ్యాడ్  సెంటిమెంట్ ఫీల్ అయి వదిలేస్తున్నారా లేక అసలు అది సీజన్ కదని వదిలేస్తున్నారా అన్నది తెలియదు కానీ కొన్నేళ్ళుగా దీపావళికి తెలుగు సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కావడం లేదు. అప్పుడెపుడో నాగార్జున రక్షకుడు తెలుగు, తమిళ్ వెర్ష‌న్లు దీపావళికీ రిలీజ్ చేస్తే చీదేశాయి.


అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు దీపావళిని టార్గెట్ చేస్తే చేదు ఫలితం వచ్చిందట. దాంతో దీపావళితో ఎందుకొచ్చిన తంటా అని అనుకున్నారేమో తెలియదు కానీ ఆ పండుగ అంటే వద్దనేస్తున్నారు. ఇక గత ఏడాది మత్రం దీపావ‌ళి ముందు వచ్చిన టాక్సీ వాలా కూడా హిట్ కాకపోవడం కూడా మరోసారి  యాంటి సెంటిమెంట్ ని ప్రూవ్ చేసింది.


ఇవన్నీ ఇలా ఉంచితే మనకు ఉన్న సెంటిమెంట్లు ఏవీ కోలీవుడ్, బాలీవుడ్ కి లేనట్లున్నాయి. దాంతో ఈసారి బడా మూవీస్  అన్ని హ్యాపీగా రిలీజ్ చేసుకుంటున్నారు. మనం మాత్రం సైరా మూవీతోనే దీపావళి సంబరం చేసుకోవాల్సివస్తోంది. వచ్చే ఏడాది అయినా తెలుగు సినిమాలు వెల్లువలా దీపావళికి వచ్చి బాంబులు పేలుస్తాయేమో  చూడాలి. ఎందుకంటే దీపావళి మంచి సీజన్, తరువాత నాగులచవితి ఉంటుంది. మరో వైపు పరీక్షల  సీజన్ కూడా కాదు, కార్తీక మాసం పిక్ నిక్ లు కూడా ఉంటాయి. అందువల్ల మంచి టాక్ వస్తే ఈ సీజన్లో కూడా హిట్ అయిన మూవీస్ పాత రోజుల్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: