టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ఆకాశంలో ఉంచారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మార్మోగిపోయింది. ఇక బాలీవుడ్ సినిమాలకు కూడా దక్కని అరుదైన.. అద్బుతమైన రికార్డులు బాహుబలి సినిమాలకు దక్కాయి. ఈ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి సాహో, సైరా వచ్చినా కూడా బాహుబలి ని తాకలేకపోయాయి. అంతటి గొప్ప సినిమా తీసిన తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ సినిమా 'ఆర్ఆర్ఆర్'. టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ సినిమాను 2020 జులై 30 న విడుదల చేయబోతున్నట్లుగా రాజమౌళి ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమేనని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ 'సైరా' సినిమా ప్రమోషన్ కోసం అంటూ దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు గాయాలైన కారణంగా కొన్ని రోజులు షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యిందనే విషయం తెల్సిందే. ఇప్పుడు రాజమౌళి తన బాహుబలి టీం తో కలిసి లండన్ కు వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ మొదటి వారం నుండి ఆలియా భట్ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం డేట్లు కేటాయించింది. 

కాని ఆ డేట్లను జక్కన్న వినియోగించుకోలేక పోయాడట. దాంతో మళ్లీ ఆలియా డేట్లు కావాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందని లేటెస్ట్ న్యూస్. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అయిదు సినిమాల్లో ఆలియా హీరోయిన్ గా నటిస్తోంది. ఆ కారణంగా ఆలియా మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాకు డేట్లు కేటాయించాలంటే ఇప్పుడప్పుడే కుదిరేపని కాదని యెలుస్తోంది. దాంతో మొత్తం షెడ్యూల్స్ అన్నీ గందరగోళం అవుతున్నాయని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. షెడ్యూల్స్ గందరగోళం అవ్వడంతో సినిమా విడుదల తేదీ విషయంలో కూడా అనుమానాలు వస్తున్నాయి. జులై 30 కి అన్న సినిమా దసరాకైనా రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

ntr