ఏదైనా సినిమా చూసిన వెంటనే బాగుంది.. బాగోలేదని జడ్జిమెంట్ ఇవ్వటం అందరు చేసేదే. ఆరేడు నెలల నుంచి రెండేళ్ల వరకూ తీసే సినిమాను.. జస్ట్ రెండున్నర గంటల్లో విషయాన్ని తేల్చేయటం చాలామందికి అలవాటే.  ప్రేక్షకుడి సంగతి సరే.. మరి.. సినిమాలో నటించిన వారి పరిస్థితి ఏమిటి? ఒక సినిమా చేశాక.. ఆసినిమాలో వాళ్ళు చేసిన పాత్ర ప్రభావం వారి మీద ఎంతకాలం ఉంటుందన్న సందేహం చాలామందికి రావడం సహజం.

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా డిఫ్రెంట్ జోనర్స్ లో కథలను ఎంచుకొని హిట్ అందుకుంటున్న హీరోయిన్ తాప్సీ ఈ విషయంలో మాత్రం అందరిలా ఉండదని అర్థమవుతుంది. తను నటించిన పాత్రలో జీవించే ఆమె.. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఆ పాత్రలో నుంచి బయటకు రావటానికి తాప్సీ పడే ఇబ్బందులు మామూలుగా ఉండవట. విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం నిజం. తాప్సీ పడే తిప్పల గురించి తాజాగా ఆమె చెప్పిన విషయాలు వింటే.. ఒక పాత్రను ఇంతలా ప్రేమించి ఆ పాత్రలో అంతగా లీనమవటం చిన్న విషయం కాదని తాప్సీ చేసే పాత్ర విషయంలో తనకున్న కమిట్ మెంట్ చూసినప్పుడు ఎవరికైనా ఆనందం ఆశ్చర్యం కలగక మానదు.  

తను ఏదైనా పాత్రకు ఓకే అన్న తర్వాత.. తనను తాను ఆ పాత్రలో చూసుకోవటం మొదలెడతానని చెబుతోంది. చెబితే ఫన్నీగా ఉంటుంది కానీ.. తాప్సీ ఒక సినిమా చూశాక తనకో రకమైన పిచ్చి పడుతుందని.. ఆ పాత్రలోనే తాను ఉండిపోతానని ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది తాప్సీ.  తను నటించిన పాత్రలోనే ఉండిపోతానని.. తనకు మరోదారి లేదని చెబుతుంది. ఇదొక క్యారెక్టర్ కాదు.. నా జీవితం ఇదేనని తాను నమ్ముతానని.. ఇంటెన్స్.. ఎమోషనల్ రోల్ చేశాక.. ఆ పాత్ర నుంచి బయటకు రావటం నాకు చాలా కష్ఠమవుతుందని తాప్సీ అంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: