తమిళ హీరో కార్తీ తన అన్న సూర్య ద్వారా మొదటి పరిచయం అయినా కూడా తన నటనతో తనకంటూ ప్రత్యేక శైలిని నిర్మించుకున్న వ్యక్తి. తెలుగులో 'నా పేరు శివ ','ఖాకీ' 'ఆవారా' వంటి చిత్రాలలో నటించి మంచి పేరు పొందాడు. కానీ ఈ మధ్య ఆయన అన్న లాగానే తెలుగులో ఇతని కూడా టైం బాగలేదు అని చెప్పలేని ఆయన నటించిన 'చిన్నబాబు' 'దేవా' రెండు చిత్రాలు కూడా భారీ డిజాస్టర్ గా నిలిచాయి.ఇప్పుడు ఈయన 'ఖైదీ' గ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు చూడాలి ఈ సరి అయినా విజయం వరిస్తుందో లేదో ..


ఒక రోజు రాత్రి నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథే ‘ఖైదీ’ సినిమా. పదేళ్ల నుంచి జైల్లో ఉండి విడుదలైన ఖైదీ పాత్రలో కనిపిస్తాను. జైల్లో ఉండటంతో పదేళ్లుగా తన పాపను కూడా చూడలేడు. మొదటిసారి తన కూతుర్ని చూడబోయే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి పాపను చూస్తానా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. పోలీసులు ఉన్నారనే ధీమాతో మనందరం హాయిగా నిద్రపోతున్నాం. పోలీసులు అనేవాళ్లు లేకుంటే పరిస్థితి ఏంటి? అనే విషయాన్ని ఈ సినిమాలో చర్చించాం.


 ‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్‌ ఉన్నాయి. అందుకే పాటలు, రొమాన్స్‌  పెట్టలేదు. ఇది ఫుల్‌ మాస్‌ సినిమా. నా పాత్ర ఊరమాస్‌గా ఉంటుంది. సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర హీరోలా మారుతుంటుంది. టైటిల్‌ కూడా సూట్‌ అవుతుందని ‘ఖైదీ’ పెట్టాం.‘ఖైదీ’ ఇంటర్నేషన్‌ల్‌ రేంజ్‌ ఫిల్మ్‌. హాలీవుడ్‌ ‘బ్యాట్‌మ్యాన్, సూపర్‌మేన్‌’ సినిమా స్టయిల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం. భవిష్యత్తులో ‘ఖైదీ’ చేశామని కచ్చితంగా గర్వపడతాం.


ఈ సినిమా కోసం నిజంగానే ఖైదీలను కలిశాం. వాళ్ల నుంచి సమాచారం తీసుకొని నా పాత్రను చేశాను. నా దృష్టిలో అందరూ ప్రేక్షకులే. తెలుగు, తమిళం అని వ్యత్యాసం ఉండదు. రెండు రాష్ట్రాలకు కొన్ని పోలికలు ఉంటాయి.ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారుతోంది.పండగకి రెండు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఏది బావుంటే దాన్ని చూస్తారు. పండగ టైంలో ప్రేక్షకులకు ఆప్షన్స్‌ ఉండాలి. బావుంటే రెండు సినిమాలూ చూస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: