దక్షిణ భారతదేశంలో వర్షాలకు తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డెంగీ జ్వరాలు ప్రబలం అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే డెంగీ జ్వరాలు వల్ల చాలామంది ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో ఆర్థికంగా చికిత్స చేయించుకో లేకపోవటంతో డెంగీ జ్వరాలు వల్ల చాలామంది ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు రాష్ట్రంలో డెంగీ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తమిళ ప్రజలను డెంగీ బారి నుంచి రక్షించడానికి నేలవేమ కషాయాన్ని ఉచితంగా అందించాలని రజనీకాంత్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.


దీంతో రజినీకాంత్ ఇచ్చిన సలహాపై విలక్షణ నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలవేము కషాయం తాగితే వికటించి లేనిపోని చిక్కులొస్తాయని కమల్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషయం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ క్రమంలో నేలవేము కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల ద్వారా రుజువైందని, డెంగీ నిరోధానికి ఈ కషాయం చాలా మంచిదంటూ ఓ పిటీషన్ కోర్టులో వేసారు. ఆ కషాయాన్ని తాను పలుమార్లు తీసుకున్నానని, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాలేదని, వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు కమల్‌ ఈ కషాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పంపిణీ చేయొద్దని అభిమానులకు ఎలా విజ్ఞప్తి చేస్తారని పిటిషన్‌లో ప్రశ్నించారు.


కాగా ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన దర్బార్ షూటింగ్ పూర్తయిన క్రమంలో ఈ నెల 13వ తారీఖున హిమాలయాలకు వెళ్ళిన రజినీకాంత్ అక్కడ ఐదు రోజులు గడిపి తెలుగు ఇటీవల చెన్నై కి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ...హిమాలయాల్లో తన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చక్కగా జరిగిందని మరియు అదే విధంగా తాను నటించిన దర్బార్ సినిమా అవుట్ పూట్టు కూడా బాగా వచ్చిందని రజినీకాంత్ తెలియజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: