బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. అందరు ఊహించినట్టుగానే వితికా ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయింది. జంటగా వచ్చిన ఇద్దరిలోంచి వితికా వెళ్ళిపోవడంతో వరుణ్ ఒంటరి వాడైపోయాడు. ఎలిమినేట్ అయ్యాక వరుణ్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఎలిమినేషన్ అయిన తర్వాత స్టేజి మీదకి వచ్చిన వితికా ఇంటి సభ్యుల గురించి మాట్లాడింది. అయితే అందరి గురించి /పాజిటివ్ గా మాట్లాడిన వితికా రాహుల్ గురించి కాస్త నెగెటివ్ గా మాట్లాడింది.


గత కొన్ని రోజులుగా రాహుల్ వరుణ్, వితికాలతో సఖ్యతగా ఉండట్లేదు. నామినేషన్ లో శివజ్యోతితో వితికాకి గొడవ జరిగినప్పటి నుండి అతని బిహేవియర్ లో చాలా మార్పొచ్చింది. ఈ విషయాలని బయటకి చెప్తూ మాతో నీకేమీ గొడవ లేకపోయినా నువ్వెందుకు మాకు దూరంగా ఉన్నావో అర్థం కాలేదని అంటుంది. నామినేషన్ లో ఎలా ఆడాలనేది ఎవరి ఇష్టం వారిది. శివజ్యోతితో గొడవ పడితే నువ్వు మాట్లాడకపోవడం నాకు నచ్చలేదని చెప్తుంది.


అంతే కాదు నువ్వు మాతో మెయింటైన్ చేసిన రిలేషన్ షిప్ ఫేక్ ఏమో అని సందేహంగా ఉందని తన మనసులోని మాటని బయట పెట్టింది. వితికా మాట్లాడిన మాటలకి రాహుల్ కి దిమ్మ తిరిగిపోయింది. ఇంకా రాహుల్ కి తెలియని విషయం మరోటి ఉంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తో  "తనీష్" ఇంటర్వ్యూ చేస్తాడని తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో రాహుల్ గురించి చెప్తూ, అతనొక అవకాశవాది అని అంటుంది.


ఐతే అది ఆమె అభిప్రాయం అయ్యుండవచ్చు. కానీ ఒక్క విషయంలో వితికాని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. శివజ్యోతితో గొడవ జరిగితే రాహుల్ మాట్లాడకపోవడం సరికాదని అంటున్నారు. ఏది ఏమైనా తన మనసులోని మాటని బయటకి చెప్పి రాహుల్ కి గట్టి షాక్ ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: