తమిళ స్టార్ అయిన సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గజిని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించిన సూర్య ఆ తర్వాత ప్రతీ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా తెలుగులో సూర్య మార్కెట్ పడిపోతూ వస్తుంది. మొన్న వచ్చిన బందోబస్త్ ని చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో సరిగ్గా ఆడలేదు.


ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం సూర్య తమ్ముడు కార్తి సినిమా కూడా తెలుగులో రిలీజ్ కాబోతుంది. "ఖైదీ" అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కార్తి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అంతే కాదు తన అన్న సూర్య నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో కూడా చెప్పేశాడు.


సూర్య త్వ‌ర‌లోనే హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్న‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు. సూర్య‌తో సింగం సిరీస్ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడ‌త‌ను. వీళ్ల క‌ల‌యిక‌లో సింగం-4 రావాల్సింది. సింగం-3 నిరాశ ప‌రిచిన నేప‌థ్యంలో కానీ దాని గురించి అప్ డేట్ లేదు. ఐతే వీళ్లిద్ద‌రూ క‌లిసి సింగం-4 చేస్తారో లేదో కానీ.. మ‌ళ్లీ సినిమా చేయ‌డం మాత్రం ఖాయ‌మ‌ని కార్తి సంకేతాలిచ్చాడు.


ఇటీవ‌లే కాప్ప‌న్ (తెలుగులో బందోబ‌స్త్) సినిమాతో ప‌ల‌క‌రించిన సూర్య‌.. దీని త‌ర్వాత లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అది పూర్తి కావ‌స్తుండ‌గా.. దాని తర్వాత హరి దర్శకత్వంలో సూర్య నటిస్తాడని కార్తి తెలియజేశాడు. మరి ఈ విషయంపై సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: