అలవైకుంఠపురంలో మూవీ సామజవారగమనా సాంగ్ బంపర్ హిట్ తరువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్,  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ మరో పాటతో ఫ్యాన్స్ ను ఫిదా చేయడానికి సిద్ధమయ్యారు. దీపావ‌ళి కానుక‌గా ఫ్యాన్స్‌కు  ‘రాములో రాములా… ‘ అని సాగే ఓ పాటను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం ఈ పాట టీజ‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్టు యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సాంగ్ టీజ‌ర్ రిలీజ్ రేప‌టికి వాయిదా ప‌డిపోయింది.


ఇప్ప‌టికే సామ‌జ‌వార‌గ‌మ‌నా సాంగ్‌కు ఏ తెలుగు సాంగ్‌కు రాని విధంగా ఏకంగా 4 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇదే ఊపుతో ఉత్సాహంతో మ‌రో సాంగ్ టీజ‌ర్‌తో కూడా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌ని ఉత్సాహంతో ఉన్న బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఒక్క‌సారిగా ఈ టీజ‌ర్ రిలీజ్ వాయిదా షాక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఇది పూర్తిగా మాస్ బీట్ తో సాగేసాంగ్ అని ఆ లిరిక్స్ చూస్తే అర్థం అవుతుంది.


ఇక ఈ సాంగ్ పోస్ట‌ర్ చూస్తే ఒక క్లాస్ పార్టీలో చేతిలో మందు గ్లాసుతో బన్నీ మాస్ బీట్ అందుకోవడం రెడీ అవుతున్న‌ట్టు ఉండ‌డంతో సినిమాలో ఈ మాస్ సాంగ్‌తో మాస్ ప్రేక్షకులు రెచ్చిపోతార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. బ‌న్నీ మాస్ స్టెప్పులు ఎలా వేస్తాడో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఈ సాంగ్ ఎలా ఉంటుందో ?  తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే. 


దువ్వాడ జగన్నాథం చిత్రంలో బన్నీకి జంటగా నటించిన పూజా హెగ్డే మరో మారు అలవైకుంఠపురంలో అతనికి హీరోయిన్ గా నటిస్తుండగా, టబు, సుశాంత్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: