ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని మొదలు పెట్టినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం దేశం మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాని 2020 జులై 30 న విడుదల చేస్తామని లాంచింగ్ రోజు ప్రకటించేశారు. అయితే ఆ రోజు ఇంకెంత దూరంలోనో లేదు. అయినా కూడా సినిమా నుండి ఒక్క అప్డేట్ రావడం లేదు. కనీసం ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల లుక్ ఎలా ఉంటుందో కూడా రివీల్ చేయలేదు.


దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ అవడానికి ఇంకా ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందనే విషయం పక్కన పెడితే, ఇలా ఆలస్యం కావడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి షూటింగ్ లో గాయాలైన కారణంగా ప్రస్తుతం వారిద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ భామ ఆలియా భట్ హిందీ సినిమాలతో బిజీగా ఉంది.


ఆమె రాజమౌళికి ఇచ్చిన డేట్స్ అయిపోయాయట. ప్రస్తుతం ఆమెతో షూటింగ్ చేయాలంటే మళ్లీ కొత్త డేట్లు తీసుకోవాల్సిందేనట. అయితే కొత్త డేట్లు కావాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందేనని సమాచారం. ఇక పోతే ఈ సినిమాలో నటిస్తున్న మరో బాలీవుడ్ నటుడ్ అజయ్ దేవగణ్ ప్రస్తుతం తన్హాజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరపాలని భావిస్తున్నారట. అయితే ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఆర్ ఆర్ ఆర్ కి డేట్స్ కుదరడం లేదట.


దీంతో రాజమౌళికి పెద్ద సమస్య ఏర్పడింది. ఇంతవరకెప్పుడూ రాజమౌళి డేట్స్ విషయంలో ఇంత ఇబ్బంది పడలేదట. కాని ఇప్పుడు బాలీవుడ్ వారిని తీసుకోవడంతో జక్కన్న మొదటి సారి డేట్స్ ఇష్యూను ఎదుర్కొంటున్నాడట. మరి ఈ ఇష్యూ నుండి తొందరగా బయటపడి సినిమాని అనుకున్న తేదీకి రిలీజ్ చేయాలని కోరుకుందాం


మరింత సమాచారం తెలుసుకోండి: