టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లో చూసుకున్న యంగ్ హీరోస్ నుండి స్టార్ హీరోస్ వరకు ఎవరి సినిమా అయినా ఫ్లాప్ అయితే దాని ప్రభావం ఆ తర్వాత సినిమా మీద పడుతుందన్న విషయం చాలా మంది హీరోల విషయంలో జరిగింది. ఇది ఒక్క హీరోలే కాదు స్టార్ డైరెక్టర్స్ పూరి జగన్నాధ్, సుకుమార్, బోయపాటి శ్రీను వంటి దర్శకుల విషయంలోను జరుగుతున్న విషయమే. ఒక్క సినిమా పోతే నిర్మాతలు మళ్ళీ ఆ హీరోకి గాని లేదా డైరెక్టర్ కి గాని మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం. గత రెండేళ్ళుగా చూస్తే యంగ్ హీరోస్ లో రాజ్ తరుణ్, మంచు బ్రదర్స్, సందీప్ కిషన్, డైరెక్టర్స్ లో చూస్తే బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల..ఇలా చాలామందే ఉన్నారు. అయితే ఈ మధ్య విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకొని నెలరోజులు నానా కష్టాలు పడి ప్రమోట్ చేసిన సినిమా డియర్ కామ్రేడ్. ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేశాడు. కాని విజయ్ కష్టమంతా వృధా అయిపోయింది. 

ఇక టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో కి సంబంధించిన సెన్సేషనల్‌ న్యూస్‌ ఒకటి సోషల్ మీడియా లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ యంగ్‌ హీరోతో ప్లాన్‌ చేసిన ఓ భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమా ఆగిపోయినట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తిరిగి సెట్స్‌ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట దర్శక, నిర్మాతలు. విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో 'హీరో' పేరుతో సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా నటిస్తున్నాడు. చాలా రోజుల కిందటే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాకి ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఢిల్లీలో షూట్‌ చేసిన ఈ షెడ్యూల్‌లో విజయ్‌పై రేసింగ్‌ సీన్స్‌ను చిత్రీకరించారు. 

అయితే నిర్మాతలు అవుట్‌పుట్‌తో సంతృప్తికరంగా లేకపోవటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరిగింది. దాదాపు 12 కోట్లు ఖర్చుపెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ కంప్లీట్ చేసిన తరువాత ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారని అందరు అనుకున్నారు.  కానీ ఈ సినిమాను తిరిగి ప్రారంభిస్తున్నట్లు లేటెస్ట్. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతో మలయాళ నటి మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభమైన మధ్యలో అనేక కారణాలతో షూటింగ్ నిలిచిపోయింది. అందుకు డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కూడా ఒక కారణమని కూడా కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఏదేమైనా మొత్తానికి ఆగిపోయిన 'హీరో' మళ్ళీ మొదలయ్యాడు. దాంతో 'డియర్ కామ్రేడ్' ఫ్లాప్ తో 'హీరో' కి సంబంధం లేదని క్లారిటి వచ్చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: