కేరాప్ కాంట్రవర్సీ.. ఈయన చుట్టూ కాంట్రవర్సీలు ఉండటం కాదు.. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లే ద‌ర్శ‌కుడే రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. హిట్ ఫ్లాపులతో పనిలేకుండా వర్మ చేసే ప్రతీ పని సంచలనమే. ఇప్పుడు కూడా ఇలాంటి పనే ఒకటి చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ మధ్య హిందీపై ఫోకస్ తగ్గించి.. తెలుగు ఇండస్ట్రీపై దృష్టి పెట్టాడు ఆర్జీవీ. ఈ జీవి ఇప్పుడు మరో సంచలన సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే చాలా సెన్సేషనల్ సినిమాలు చేసిన వర్మ.. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నారు.


మొత్తానికి ఆయ‌న‌ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ.. తెరకెక్కిస్తోన్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 27 న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఇటివలే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ‘బాబు చంపేస్తాడు’ అనే వీడియో లిరికల్ సాంగ్ కూడా ఎప్పటిలాగే వివాదాస్పదమైన పదాలతో ఓ నాయకుడిని బాగా టార్గెట్ చేస్తూ వచ్చింది. కానీ సాంగ్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.


కాగా కులాల్ని బేస్ చేసుకుని ఉండనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వర్మ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇప్పటీకే సినిమా చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లోని వ్యక్తి చంద్రబాబు వేషధారణలో ఉండటంతో టీడీపీ కార్యకర్తలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఏమైనా సినిమా పేరుతోనే రెండు ప్రధాన సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరునే వర్మ సినిమాగా తీస్తున్నాడట. అసలు టైటిలే వివాదాస్పదంగా ఉందనుకుంటే.. సినిమా అంతకన్నా వివాదాస్పదంగా ఉండేలా కనిపిస్తోంది.  మొత్తానికి ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో బాబు చంపేస్తడు అన్న‌ పాటతో  గ‌తంలో కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: