మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విబేధాలు బాగా ముదిరిపోయాయని మీడియాలో రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా 20వ తేదీ ఆదివారంనాడు తెలుగు సినిమా నటీనటుల సంఘం ఆత్మీయ సమావేశంలో రచ్చ రచ్చ జరిగిందని తెలుగు మీడియా ఘోషించింది. పరుచూరి కంటతడి పెట్టుకున్నారని కూడా ఊహాగానాలు వచ్చాయి.


పృథ్వీ వంటి వారు తమ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడంతో వేడి మరింత పెరిగింది. ఈ సమయంలో జీవిత రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో మాలో విబేధాలు ఉన్నాయని ఆమె అంగీకరించడం అందరికీ షాక్ ఇచ్చింది.


అవును ఈ మీటింగ్ హాట్ హాట్ గా జరిగింది. వాదులాడుకున్నాం.. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాం.. ఒకరికి ఒకరు సమాధానం చెప్పుకున్నాం అని ఆమె అంగీకరించడంతో మాలో విబేధాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. సీనియర్‌ నరేశ్‌ అధ్యక్షుడిగా, డా. రాజశేఖర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జనరల్‌ కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ 'మా' బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


జీవిత ఇంకా ఏమన్నారంటే.. ఆదివారంనాడు జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళం, 'మా' సమావేశం ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. వారందకిరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదివారం 9గంటలనుంచి సాయత్రం 5.30 గంటలవరకు నిర్విఘ్నంగా సమావేశం జరిగింది.


ముఖ్యంగా 26 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం సాల్వ్‌ చేసుకోలేకపోయాం. దానికి కొన్ని కారణాలూవున్నాయి. ఈ క్రమంలో వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఏదిఏమైనా ఉపయోగ‌కరమైన సమావేశం అని గట్టిగా చెప్పగలను. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా 'ఎక్స్‌ట్రా జనరల్‌బాడీ మీటింగ్‌' పెట్టుకోవాలని సూచనలు చేశారు. దానికి సంబంధించిన బైలా ప్రకారం ఏం చేయాలనేది పరిశీలించాం.


ఆ సమావేశంలో 'మా' లాయర్‌ గోకుల్‌గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్‌గారు కూడా వున్నారు. అందరూ కలిసి ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ మీటింగ్‌ జరగాలని అనుకోవడం జరిగింది. 'మా' సభ్యుల్లో 900పైగా వున్నారు. అందులో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ జరుగుతుంది. అప్పుడే 'మా' సమస్యలు పరిక్షరించుకోవడానికి అవకాశం వుంటుంది..అని జీవిత అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: