సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. సినిమా హిట్ కావడంతో చిరు మరో సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

 

కొరటాల శివల చిత్రం వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి.తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ చేత మ్యూజిక్ చేయించుకున్న కొరటాల ఈసారి బలంగా మార్పు కోరుకుంటున్నారట.

 

ఇప్పటికే చర్చలు మొదలయ్యాని, త్వరలో ఫైనల్ క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకి జోడీగా త్రిష నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

 

అంతేకాదు చిరు సైతం బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్, అతుల్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. ఈ ఇద్దరు ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, జీరో’ సినిమాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఆకట్టుకున్నారు. వీరైతే తమ సినిమాకు బాగుంటుందని చిరు భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: