టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ గా ఈశ్వర్ సినిమా నుండి మొన్నటి సాహో సినిమా వరకు పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రభాస్, టాలీవుడ్ హీరోల్లో తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపుని సంపాదించారు అనే చెప్పాలి. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం సినిమాతో హీరోగా ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న ప్రభాస్, ఆ తరువాత ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి తదితర సినిమాలతో తన రేంజ్ ని అమాంతం పెంచుకుంటూ వెళ్లి, ప్రస్తుతం భారత దేశం గర్వించదగ్గ హీరోల్లో ఒకరుగా ఎదిగారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

ఇకపోతే ప్రస్తుతం పూజ హెగ్డేతో కలిసి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్, రేపటి తన పుట్టినరోజు సందర్భంగా ఒక సంచలన ప్రకటన చేయనున్నట్లు నేడు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్, ఆయన బర్త్ డే నాడు పలు విధాలైన సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న దానిని బట్టి, బర్త్ డే సందర్భంగా ప్రభాస్ తన పెళ్లిని గురించి మీడియాకు మరియు తన ఫ్యాన్స్ కు ఒక శుభవార్త చెప్తారని అంటున్నారు. 

ఇక మరికొందరు అయితే, కాదు కాదు తన తదుపరి మరొక్కసారి ఆయన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని, ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ ని చేస్తారని అంటున్నారు. ఇక ఇప్పటికే మొన్నటి బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా లండన్ చేరుకున్న ప్రభాస్, తన బర్త్ డే ని గ్రాండ్ గా అక్కడే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే బర్త్ డే నాడు ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారో అనే విషయమై ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో కూడా విపరీతంగా చర్చ జరుగుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: