మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ లో ఎన్నో ప్రేమన‌గర్లు, తాజ్ మహళ్ళు కట్టి వెళ్లారు. ఆయన సంపాదించిన ప్రతీ పైసా సినిమా కోసమే ఖర్చుపెట్టారు. ఎక్కడో కారంచేడులో వ్యవసాయం చేసుకుందమనుకున్న‌ నాయుడు గారి మనసు సినిమా వైపు మళ్ళడం తెలుగువారు చేసుకున్న అద్రుష్టమే. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే టాలీవుడ్ గర్వించే ఎన్నో అద్భుతమైన సినిమాలను ఆయన అందించారు. నిర్మాత అంటే ఇలా  ఉండాలని ఆయన ఒక డెఫినిషన్ చెప్పారు. ఒక స్పూర్తిగా నిలిచారు.


రామానాయుడు చిన్న కుమారుడు వెంకటేష్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో అంటే వెంకటేష్ అని చెప్పాలి. అందుకే ఆయన్ని విక్టరీ వెంకటేష్ అంటారు. ఇక వెంకీ వారసునిగా ఆయన అన్న, నిర్మాత అయిన సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా హీరోగా వచ్చాడు. రానా వస్తూనే ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించాడు. ఒక్క బాహుబలి చాలి రానా ప్రతిభ చెప్పడానికి


ఇపుడు అదే వరసలో ఆయన తమ్ముడు దగ్గుబాటి అభిరాం వస్తున్నాడు. యాక్టింగ్ లో మంచి శిక్షణ తీసుకుంటున్న అభిరాం డ్యాన్సులు, ఫైట్లు కూడా బాగా చేస్తున్నాడుట. అభిరాం కోసం అపుడే నిర్మాతలు క్యూ కట్టడం విశేషం. అయితే తన కొడుకు మొదటి సినిమా తానే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో  తీయాలని దగ్గుబాటి సురేష్ అనుకుంటున్నారుట.


అందుకోసం మంచి కధలను ఇపుడు వింటున్నారుట. అన్న రానా బాటలో హీరోగా వస్తున్న అభిరాం ఎంట్రీ 2020లో ఉంటుందని అంటున్నారు. మంచి ఫామిలీ లవ్ స్టోరీతో అభిరాం అలరించవచ్చునని టాక్ వినిపిస్తోంది. అన్ని వర్గాలను అలరించే కధను సురేష్ సెలెక్ట్ చేస్తే ఇక వెండి తెరకు మరో యూత్ ఫుల్ హీరో దొరికేసినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: