సౌత్ లో చాలా పాపులర్ అయిన శృంగారతార షకీలాకు చాలా తక్కువమంది స్నేహితులున్నారన్న విషయం చాలా సందర్భాలలో ప్రస్తావించింది. అయితే తనకు కాస్త క్లోజ్ మాత్రం పూజా భట్ అని చాలా తక్కువమందికే తెలుసు. అంతేకాదు పూజా భట్ కు షకీలా కి ఒక అవినాభావ సంబంధం ఉంది. కానీ వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్ కి కారణం సిగరెట్ అంటే ఎవరైనా నమ్ముతారా. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఈ విషయాన్ని షకీలానే స్వయంగా బయటపెట్టింది. ఊహ తెలిసినప్పట్నుంచి బోల్డ్ గానే ఉంటున్న తనకు, పూజా భట్ సిగరెట్ అలవాటు చేసిందనే టాప్ సీక్రెట్ ని షకీలా ఓపెన్ గా చెప్పింది. 

నేను సిగరెట్ తాగడాన్ని ఓ స్టయిల్ కోసం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఆ స్టయిల్ ని వదల్లేకపోతున్నాను. పూజాభట్ ఓసారి షూటింగ్ కోసం చెన్నై వచ్చినప్పుడు సిగరెట్ తాగుతుంటే చూశాను. అప్పుడు నన్ను చూసి పూజా భట్ పిలిచింది. తాగమని చెప్పి సిగరెట్ ఇచ్చింది. అలా నాకు సిగరెట్ తాగడం అలవాటైంది. ఇప్పుడు కూడా మానేయాలని అనుకుంటున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా మానేయలేకపోతున్నానని అంది షకీలా. పూజా భట్ అలవాటు చేసిన సిగరెట్ ను దాదాపు 30 ఏళ్లుగా తాగుతూనే ఉన్నానని స్పష్టంచేసింది. మరోవైపు పెళ్లిపై కూడా అంతే బోల్డ్ గా రియాక్ట్ అయింది. 

తన లైఫ్ లో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ ఎవ్వర్నీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని నిర్మొహమాటంగా చెప్పింది. పెళ్లి చేసుకుంటే విడాకులు గ్యారెంటీ అనే విషయం తనకు తెలుసని, అందుకే సింగిల్ గానే ఉండిపోయానంటోంది షకీలా. తన లైఫ్ లో 7-8 మందిని ఇష్టపడ్డానని, కానీ వాళ్లను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం పూర్తిగా తనదే అంటున్న షకీలా.. ఇప్పటికి ఆ 8 మంది తన కుటుంబాలతో పాటు తన ఇంటికి వస్తుంటారని వెల్లడించారు. అయితే ఎందుకనో వాళ్ల పేర్లు మాత్రం బయటపెట్టడానికి ఇష్టపడలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: