టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కలల సినిమాగా ఇటీవల గాంధీ జయంతి నాడు విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలు అందుకోవడంలో మాత్రం చాలా వరకు దెబ్బతిన్నది అనే చెప్పాలి. మెగాస్టార్ అదరగొట్టే యాక్షన్ తప్పించి సినిమాలో పెద్దగా ఏమి లేదని, 

ఇక సినిమాలో విజువల్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, సెట్టింగ్స్ వంటివి ఎంతో గ్రాండియర్ గా ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథ మరియు కథనాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలావరకు విఫలయమయ్యాయని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్న మాట. ఇకపోతే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగాస్టార్ 151వ సినిమాగా రూపొందిన సైరా నరసింహారెడ్డి, మన తెలుగుతో పాటు బాలీవుడ్ మరియు ఓవర్సీస్ లలో కూడా భారీ స్థాయిలోనే ప్రీ రిలీజ్ చేసింది. అయితే నేడు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, సైరా సినిమా వరల్డ్ వైడ్ గా మొత్తం కలుపుకుని రూ.131 కోట్ల వరకు షేర్ కలెక్షన్ ని అందుకుందని అంటున్నారు. 

అయితే అందులో బాలీవుడ్ నుండి రూ.13 కోట్లు మరియు ఓవర్సీస్ నుండి 2.6 మిలియన్ల డాలర్లు మాత్రమే కలెక్షన్ దక్కిందని, అయితే మిగతా ప్రాంతాల్లో కూడా నష్టాలు వచ్చినప్పటికీ, ఆ రెండు ప్రాంతాల బయ్యర్లకు కొంత ఎక్కువగా నష్టం వచ్చినట్లు చెప్తున్నారు. ఇక వారు చెప్తున్న దానిని బట్టి సైరా పరిస్థితి ఆల్మోస్ట్ పూర్తిగా అయిపోయిందని, ఇక క్లోసింగ్ సమయానికి మహా అయితే మరొక ఐదు కోట్లకు మించి కలెక్షన్ వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాగానే బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. అయితే ఈ సినిమా కొట్టిన దెబ్బతో మెగాస్టార్ 152వ సినిమాను నిర్మిస్తున్న ఆయన కుమారుడు చరణ్, బడ్జెట్ విషయమై కొంత శ్రద్ధ వహిస్తున్నట్లు సమాచారం...!!


మరింత సమాచారం తెలుసుకోండి: