‘గురు’ సినిమాలో బాక్సర్‌గా బాక్సాఫీస్‌కు ఫటా ఫట్‌ పంచ్‌లు ఇచ్చిన వెంకటేశ్‌ మరో స్పోర్ట్స్‌ మూవీ కోసం గుర్రపు స్వారీకి సై అన్నారని సమాచారం. ఈ స్పోర్ట్స్‌ సినిమాకు ‘పెళ్ళిచూపులు’ ఫేమ్‌ తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది.కబడ్డీలాంటి ఆటలకు గోపీచంద్‌లాంటి కటౌట్‌ ఉన్న హీరోలు బాగా సూట్‌ అవుతారు. త్వరలో గోపీచంద్‌ కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టనున్నారు. కానీ ఆటగాడిగా కాదు.. కోచ్‌గా. కోర్టులోకి దిగి తన జట్టు సభ్యులకు శిక్షణ ఇచ్చి గెలుపు మంత్రం చెప్పబోతున్నారు.మ్యాచ్‌లో తన సహచర ఆటగాడు అందించిన పాస్‌ అందుకుని హాకీ స్టిక్‌తో బంతిని ఎక్స్‌ప్రెస్‌ వేగంతో గోల్‌ పోస్ట్‌ వైపు తీసుకెళ్తున్నారు సందీప్‌ కిషన్‌.


400 మీటర్స్‌ స్ప్రింటర్‌గా సరికొత్త ట్రాక్‌ రికార్డును క్రియేట్‌ చేయాలనుకునే కలలవైపు పరుగులు పెడుతున్నారు ఆది పినిశెట్టి. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘క్లాప్‌’.బాణం చేతపట్టి హిట్‌ మూవీపై గురి పెట్టారు నాగశౌర్య. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ స్పోర్ట్స్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం.


బాక్సర్‌గా... రేసర్‌గా.. ఒకేసారి రెండు ఆటలు ఆడటానికి రెడీ అవుతున్నారట విజయ్‌ దేవరకొండ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫైటర్‌’. ఈ చిత్రం కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో సాగుతుందని, విజయ్‌ బాక్సర్‌గా నటిస్తారని టాక్‌. 


ఆల్రెడీ కొంతమంది హీరోలు క్రీడాకారులుగా సాధన మొదలుపెట్టేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇందులో గోపీచంద్‌ పాత్రలో సుధీర్‌ బాబు నటించనున్నారు. సుధీర్‌బాబు ఆల్రెడీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అనే విషయం తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తారు. ‘గద్దలకొండ గణేష్‌’ తర్వాత చేయబోతున్న చిత్రంలో  వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో కిరణ్‌ కొర్రపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఇలా టాలీవుడ్ స్పోర్ట్స్ మీద సినిమాలు చాల ఎక్కువ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: