తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ప్రస్తుతం బాగా అలరిస్తున్న రియాల్టీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ 3 రియాల్టీ షో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ షో తెలుగు టీవీ చానల్స్ రేటింగ్స్ లో అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం జరుగుతున్న సీజన్ త్రి లో ఇంటిలో ఉన్న సభ్యులు మరియు బిగ్ బాస్ ఇస్తున్న గేమ్ టాస్కులు ప్రేక్షకులను మరియు బిగ్ బాస్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ సీజన్ 3 గురించి నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కేవలం వీకెండ్లో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అన్న దాని విషయంలో మాత్రం మైనస్ గా ముందే లీక్ అవడంతో అది తప్ప షో మొత్తం కేక పుట్టిస్తుంది అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా హౌస్ నుండి వితికా కంటే ముందు వారం ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా తాజాగా బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గురించి సంచలన కామెంట్ చేశాడు. ఇటీవల ఓ టీవీ ఛానల్ లో మాట్లాడిన మహేష్ విట్టా అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి న్యాచురల్ స్టార్ నాని వల్ల షోలోకి రాగలిగానని చెప్పాడు. ఇక హౌస్ లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. హౌస్ లో ప్రతీ ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుందని చెప్పాడు.


బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల కారణంగా హౌస్ లో చిన్న చిన్న గొడవలు  జరిగేవని.. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారని మహేష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ అంటే తనకు చాలా ఇష్టమని మహేష్ విట్టా పేర్కొన్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే ఓట్ల ప్రకారంగా రాహుల్ విన్నర్ అని.. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే మాత్రం శ్రీముఖి విన్నర్ కావొచ్చని.. ఆ రాజకీయాలు ఏంటనేవి మాత్రం మనం చెప్పలేము అంటూ మహేష్ విట్టా పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: