‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్నందు వల్ల ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు దాదాపు రెండు సంవత్సరాల పాటు మరి ఏసినిమాలో నటించకుండా తమకు వస్తున్న అనేక అవకాశాలు వదులు కోవడమే కాకుండా తమ సంపాదన కూడ పోగొట్టుకుంటున్నారు. ఈమూవీలో నటిస్తున్నందుకు వీరిద్దరికీ చెరొక 25 కోట్లు భారీ పారితోషికాలు ఇస్తున్నా ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం చరణ్ జూనియర్ లు చేస్తున్న త్యాగాన్ని గుర్తించి రాజమౌళి వీరిద్దరికీ చిల్లర ఖర్చుల నిమిత్తం ఇస్తున్న భారీ మొత్తాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.

లీకు అవుతున్న వార్తల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పూజా కార్యక్రమాలు జరిగిన రోజునుండి ప్రతినెల చరణ్ జూనియర్ లకు నెలకు 10 లక్షలు చొప్పున వారిద్దరికీ వారి వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ఈమూవీ నిర్మాత దానయ్య ఇస్తున్నట్లు టాక్. ఈమూవీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చే ఏడాది చివరకు లేదంటే ఆపై ఏడాది విడుదల అవుతుంది అని వస్తున్న లీకులను బట్టి చరణ్ జూనియర్ లకు వారి చిల్లర ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాలు కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంటాయని అంటున్నారు. 

అంతేకాదు ఈమూవీ మొదలైన నాటినుండి రాజమౌళి కూడ చరణ్ జూనియర్ ల పద్ధతిని అనుసరిస్తూ తన చిల్లరి ఖర్చుల నిమిత్తం నెలకు 20 లక్షలు తీసుకుంటున్నాడు అన్నగాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. అయితే ఈసినిమాకు సంబంధించి రాజమౌళి పారితోషికంగా ఎటువంటి మొత్తాలు తీసుకోకుండా ఈమూవీ లాభాలలో 50 శాతం తీసుకుంటున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి ఎన్నో అనుకోని ఖర్చులతో పాటు రాజమౌళి ఈమూవీ పై పెడుతున్న భారీ బడ్జెట్ వల్ల ఈమూవీ బడ్జెట్ 400 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మితే కానీ నిర్మాతకు లాభాలు రావని అందుకోసమే ఈమూవీకి హైక్ తీసుకురావడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అన్వేషిస్తూ ఈమూవీ బిజినెస్ ను కనీసం 600 కోట్ల స్థాయిలో చేయాలని రాజమౌళి వ్యూహం..


మరింత సమాచారం తెలుసుకోండి: