నందమూరి హీరో తో పటాస్ పేల్చి  అందరినీ కడుపుబ్బ నవ్వించాడు.. మాస్ మహారాజ్ రాజా ది గ్రేట్ అంటూ తన సత్తా నిరూపించాడు... ఒక సీనియర్ హీరో ని జూనియర్ హీరోనే ఒక దగ్గర చేర్చి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ అందరికీ దగ్గర అయిపోయాడు... ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు అంటూ  ప్రేక్షకుల్లోకి  దూసుకొస్తున్నాడు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి. సగటు సీనీ ప్రేక్షకుడిని అలరించటమే  ధ్యేయంగా... అందరినీ నవ్వించడం లక్ష్యంగా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇదిలా ఉండగా అటు మహేష్ బాబు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.  శ్రీమంతుడు తో ఒక ఊరిని బాగు చేసే యువకుడిగా ... భరత్ అనే నేను తో రాష్ట్ర పాలనను గాడిలో   ముఖ్యమంత్రిగా... మహర్షితో సక్సెస్ కోసం పరుగులు తీసే విద్యార్థిగా ఇలా  విభిన్న కథలతో దూసుకుపోతూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వం తో... ఇటు మహేష్ బాబు హీరోయిజం తో  వరుస సినిమాలతో బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు. అలాంటి ఫుల్  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ... సక్సెస్ ఫుల్  హీరో కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. 

 

 ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలన్న...  మహేష్ బాబు సినిమాలన్న ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ దర్శకుడు ఈ హీరో కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ఎలాంటి ప్రభంజనం  సృష్టించ బోతుందోనని తెలుగు ప్రేక్షకులందరూ భారీ అంచనాలు పెంచుకొంటున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా కలిసి నటించని  కాంబినేషన్ ఇదే. ఇప్పటివరకు అనిల్ రావిపూడి మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమా కూడా రాలేదు... దీంతో వీరిద్దరికి  ఈ సినిమా మొదటిదే . అంతేకాకుండా ఈ సినిమాలో కథానాయికగా చేస్తున్న రష్మిక మందన మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ మొదటిసారే . దీంతో ఈ కాంబినేషన్  ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది. 

 


 ఈ సినిమాలో  అన్ని హెట్టే .. వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి... వరుస విజయాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... హీరోలందరికీ హిట్ జోడిగా నిలిచి  మంచి విజయాలను అందుకుంటున్న రష్మిక మందన... ఇప్పటికే ఎన్నో  అందుకుని  మరోసారి రీ ఏంట్రీ ఇవ్వబోతున్న విజయశాంతి... ఇలా ఈ సినిమాలో ప్రతీది  హిట్టే . ఎంతోమంది విజయవంతమైన నటులతో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా అటు అందరి కెరీర్లో మరో బ్లాక్ బస్టర్  హిట్ గా  మారబోతుంది అంటూ తెలుగు ప్రేక్షకులందరూ అంచనాలు పెంచుకొంటున్నారు. మరి ఈ  హిట్ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: