నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా రూలర్. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. 

 

కథ :    

 

పోలీస్ ఆఫీసర్ ధర్మా (బాలకృష్ణ) మినిస్టర్ భవాని సింగ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన కులాంతర వివాహానికి ధర్మా సపోర్ట్ గా నిలుస్తాడు. భవాని సింగ్ ధర్మాని టార్గెట్ చేస్తాడు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ధర్మ ఓ కంపెనీ సి.ఈ.వో అర్జున్ ప్రసాద్ గా ప్రత్యక్షమవుతాడు. ఇంతకీ ఈ అర్జున్ ప్రసాద్ ఎవరు..? ధర్మ ఎందుకు అలా మారాల్సి వచ్చింది..? భవాని సింగ్ ను ఎందురించి అర్జున్ ప్రసాద్ అలియాస్ ధర్మ ఎలా పోరాడాడు అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

బాలయ్య బాబు సినిమా అంటే మాస్ ఆడియెన్స్ కు పండుగే. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఏమాత్రం నిరాశపరచడం ఇష్టం ఉండని బాలకృష్ణ. కథ, కథనాలు ఎలా ఉన్నా ఫైట్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పటిలానే రూలర్ సినిమాలో కూడా ఫైట్లు, బాలకృష్ణ డైలాగులు అదిరిపోయాయి. కాని అసలు కావాల్సిన కథా వస్తువే పరమ రొటీన్ గా అనిపిస్తుంది. కథ రొటీన్ గా ఉన్నా పోని కథనం అయినా కొత్తగా ఉంటుందా అంటే అది పాత చింతకాయ పచ్చడి లానే నడిపించాడు దర్శకుడు కె.ఎస్ రవికుమార్.

 

సినిమా మొదలైన దగ్గర నుండి ఎండ్ అయ్యేంత వరకు మొత్తం బాలకృష్ణ ఇదివరకు సినిమాల్లో ఫైట్లు, డ్యాన్సులు, పంచు డైలాగులు ఇవి తప్ప కొత్తగా ఎక్కడ అనిపించదు. ఇక ముందే ఊహించే కథ, కథనాలకు బాలయ్య ఫుల్ ఎనర్జీ పెట్టి చేశాడని అనిపిస్తుంది. పక్కా రొటీన్ ఫార్ములాతో వచ్చిన రూలర్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించగా సెకండ్ హాఫ్ ఆడియెన్స్ పేషన్స్ కు పరీక్ష పెడుతుంది.

 

బాలకృష్ణ రెగ్యులర్ సినిమాల తరహాలోనే ఉన్నా ఎక్కడ ఆకట్టుకునే సన్నివేశం లేకుండా రూలర్ వస్తుంది. కేవలం నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే బాలయ్య బాబు నటన, డ్యాన్సులు, ఫైట్స్ నచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్, సగటు సినిమా ప్రేక్షకుడికి మాత్రం బాలయ్య రూలర్ నచ్చే అవకాశం లేదు.

 

నటీనటుల ప్రతిభ : 

 

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే లెక్కకు మించి ఫైట్లు, మాస్ డైలాగులు ఆశిస్తారు. అలాంటి వాటికి రూలర్ లో లెక్కలేనన్ని ఉన్నాయి. బాలయ్య బాబు తన నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటిలో తన సత్తా చాటాడు. ముఖ్యంగా ఈ వయసులో కూడా బాలయ్యలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. తనదైన శైలిలో వన్ మ్యాన్ షో చేశాడు బాలకృష్ణ. ఇక సోనాల్ చౌహాన్, వేదిక గ్లామర్ షోకి అంకితమయ్యారు. వారికి పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు. ఇక భూమిక కూడా ఎప్పటిలానే తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలానే అలరించాడు. భవాని సింగ్ పాత్ర చేసిన నటుడు బాగా చేశాడు. సప్తగిరి కామెడీ కొద్దిగా నవ్విస్తుంది. 

 

సాంకేతికవర్గం పనితీరు :

 

చిరంతన్ భట్ మ్యూజిక్ పర్వాలేదు అన్నట్టుగా ఉంది. మాస్ సినిమాలకు కావాల్సిన బిజిఎం ఇచ్చాడు. సంక్రాంతి పాట బాగుంది. సినిమాకు సంగీత దర్శకుడు తన వరకు న్యాయం చేశాడు. పరుచూరి మురళి కథ రొటీన్ అని చెప్పొచ్చు. కథ, కథనాలు ఏమాత్రం కొత్తగా అనిపించవు. కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడిగా కె.ఎస్ రవికుమార్ ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

బాలకృష్ణ గ్రేస్

సోనాల్ చౌహాన్, వేదిక గ్లామర్

 

మైనస్ పాయింట్స్ :

 

రొటీన్ స్టోరీ

స్క్రీన్ ఒలే

సెకండ్ హాఫ్

విసుగెత్తించే ఫైట్స్

 

బాటం లైన్ : 

 

బాలయ్య రూలర్.. కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే..!

 

రేటింగ్ :

 

2/5   
 

మరింత సమాచారం తెలుసుకోండి: