నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన సినిమా ఎంత మంచివాడవురా. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్ష లో చూద్దాం. 

 

కథ :

 

తనకంటూ ఎవరు లేని బాలు (కళ్యాణ్ రామ్) తన చిన్ననాటి స్నేహితురాలు నందిని (మెహ్రీన్ కౌర్) తో కలిసి షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాడు. అయితే నందినితో కలిసి బాలు ఒక కొత్త బిజినెస్ మొదలుపెడతారు. రిలేటివ్స్ ఎవరు లేక బాధపడుతున్న వారికి అద్దెకు వాళ్లను సప్లై చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో బాలు కూడా ఒకరి ఇంటికి వాళ్ల మనిషిగా వెళ్తాడు. అలా వెళ్లిన అతనికి అక్కడ ఎదురైనా సమస్యలు ఏంటి..? బాలు, నందినిలు బిజినెస్ ఎలా రన్ అయ్యింది..? అన్నది సినిమా కథ.

 

విశ్లేషణ :

 

శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఆ సినిమాతో సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టాడు. మళ్లీ అదే సెంటిమెంట్ తో ఎంత మంచి వాడవురా సినిమాతో వచ్చాడు సతీష్. ఇక ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుందని అనిపించినా సరైన స్క్రీన్ ప్లే లేక సినిమా ఆడియెన్స్ ను అలరించలేకపోయింది. ముఖ్యంగా అద్దెకు అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించగా సినిమాను నడిపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా సాగినా సినిమా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. 

 

ఫస్ట్ హాఫ్ సినిమా సరదాగా సాగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మరీ సెంటిమెంట్ ఎక్కువ అవడం వల్ల కాస్త బోర్ కొడుతోంది. ఎవరు లేని ఒంటరి జీవితాలకు కుటుంబ విలువలు  ఎలా ఉంటాయో తెలిసేలా చూపించిన సినిమా ఇది. సినిమా అంతా డ్రామాగా తీశాడు సతీష్ వేగేశ్న. 

 

సంక్రాంతికి వచ్చిన ముందు రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఈ కథతో ఎంత మంచివాడవురా మూవీ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. సినిమా కథ దర్శకుడు సతీష్ బాగానే రాసుకున్నా కథనం చాలా స్లోగా నడిపించడం మైనస్ అని చెప్పొచ్చు. అయితే మరీ అంత తీసిపారేసేలా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా సినిమా ఉంది. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ కూడా మిస్ అయ్యిందని చెప్పొచ్చు.

 

నటీనటుల ప్రతిభ : 

 

నందమూరి కళ్యాణ్ రామ్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. బాలు పాత్రకు కళ్యాణ్ రామ్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఇక సినిమాలో మెహ్రీన్ కౌర్ కూడా బాగా చేసింది. నరేష్, శరత్ బాబు, సుహాసిని, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, ప్రవీణ్, సుదర్శన్ అందరు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

 

రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా కెమెరా వర్క్ బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది. బీజీఎమ్ అలరించింది. కథ, కథనాలు దర్శకుడు సతీష్ వేగేశ్న తన ప్రతిభ చాటాడు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ :

 

కళ్యాణ్ రామ్ 

 

సినిమాటోగ్రఫీ 

 

ఫ్యామిలీ ఎమోషన్స్ 

 

మైనస్ పాయింట్స్  : 

 

సాగదీసిన స్క్రీన్ ప్లే 

 

మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ 

 

బాటం లైన్ : ఎంత మంచివాడవురా.. మంచి ఛాన్స్ మిస్..!

 

రేటింగ్ : 2/5

మరింత సమాచారం తెలుసుకోండి: