క్రేజీ హీరోయిన్ రష్మిక కు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అందరితోను నటిస్తున్న త్వరలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించే మూవీలో నటిస్తోంది. త్వరలో ఈమె జూనియర్ తో కూడ నటించే అవకాశాలు ఉన్నాయి.
లేటెస్ట్ గా ఈమె ఒక ఈవెంట్ కు హాజరైన సందర్భంలో ఒక వీరాభిమాని ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో సెల్పీ దిగడానికి వచ్చినట్లుగా చెప్పి ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకుని ఒక్కసారిగా ఆమె తేరుకునే లోపే అక్కడ నుండి పారిపోయిన సంఘటనకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనితో ఆ అభిమాని చేసిన పనికి రష్మిక కొద్ది క్షణాల పాటు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ వీరాభిమాని అక్కడితో సరిపెట్టకుండా అతడు రష్మిక ను ముద్దు పెట్టుకున్న వీడియోను వేరే వ్యక్తి చేత తీయించి దానిని సోషల్ మీడియాలో కూడ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రవేట్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఈ విషయమై లోకల్ పోలీసులకు కంప్లైట్ ఇవ్వడంతో ఆ వీడియోను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక రష్మిక కు హిందీ ‘జెర్సీ’ రీమేక్ లో నటించే అవకాశం వచ్చినా తాను నో చెప్పిన విషయాన్ని ఆమె స్వయంగా బయట పెట్టింది. తల్లి పాత్ర కావడంతో ఆ పాత్రను తాను ఒప్పుకోలేదు అని అంటోంది. ఇక తనతో పనిచేసే బ్యాచిలర్ హీరోలు పెళ్లికి రెడీగా ఉండమని రష్మిక సంచలన ప్రకటన చేసింది. కన్నడలో తను ధ్రువ్ సర్జాతో నటిస్తున్న సమయంలో అతడికి పెళ్లి కుదిరిందని ఇప్పుడు భీష్మలో నటిస్తున్నప్పుడు నితిన్ పెళ్లి అవుతోందని రష్మిక చెపుతోంది. అయితే రష్మిక అసలైన వ్యక్తిని మరిచిపోయింది. విజయ్ దేవరకొండ ఆమెతో రెండు సినిమాలలో నటించిన నేపధ్యంలో ఇప్పుడు ఈమె సెంటిమెంట్ వల్ల విజయ్ కు ఎప్పుడు పెళ్ళి కుదురుతుందో చూడాలి..