దురదృష్టం ఎటు వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏది ఎలా జరిగినా మన పక్కన దరిద్రం ఉంటే మనం ఏమీ చేయలేము. ఉదయం కోటి రూపాయలు ఉచితంగా వచ్చి సాయంత్రానికి కోటి రూపాయలు అప్పుల్లో ఉండవచ్చు. ఇలాంటిదే ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగింది. కెరీర్ పరంగా తొలి రోజుల్లో అగ్ర హీరోగా ఎదిగాల్సిన ఉదయ్ కిరణ్... అనూహ్యంగా వరుస ఫ్లాపులతో... కెరీర్ ని అర్ధంతరంగా ముగించే పరిస్థితి వచ్చింది. నా వాళ్ళు ఆదుకోలేదు. మంచి కథలతో సినిమాలు చేస్తామని వచ్చిన దర్శకులు వద్దన్నారు. 

 

దానికి కారణం ఒక పెళ్లి. ఆయనకు సిని పరిశ్రమ పెద్ద నుంచి వచ్చిన ఒక ఆఫర్. ఆ పెళ్లి చేసుకుని ఉంటే ఆయన కెరీర్ ఈ రోజు ఇంకోలా ఉండేది. ఉదయ్ కిరణ్ గ్లామర్ గాని, ఉదయ్ కిరణ్ నటన గాని... ఇప్పుడు ఉన్న చాలా మంది స్టార్ ఇమేజ్ ఉన్న నటులకు లేదు. ఏ ఆసరా లేకుండా వచ్చి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోల తనయులు తమ తండ్రికి ఉన్న ఇమేజ్ తో పైకి వచ్చిన వాళ్ళే. అగ్ర హీరోలు అనిపించుకుంటున్న వాళ్ళే. 

 

ఆ రోజు ఉదయ్ కిరణ్పెళ్లి చేసుకుని ఉంటే అతని కెరీర్ ఎవరికి అందని రేంజ్ లో ఉండేది. అగ్ర దర్శకులు ఆయన డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడి ఉండేది. దరిద్రం తల మీద ఉంటే ఎవరు మాత్రం ఎం చేస్తారు చెప్పండి. ఉదయ్ కిరణ్ తల మీద ఆ రోజు దరిద్రం నాట్యమాడింది అని అతన్ని అభిమానించిన వాళ్ళు చెప్పే మాట. ఆ పెళ్లి అయి ఉంటే అతని కెరీర్ ఊహకు కూడా అంది ఉండేది కాదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: