నటీనటులు : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, లక్ష్మణ్, తదితరులు

మ్యూజిక్ : రఘు కుంచె

సినిమాటోగ్రఫి : ఆరుల్ విన్సెంట్

డైరక్షన్ : కరుణ కుమార్ 

ప్రొడ్యూసర్ : ధ్యాన్ అట్లూరి

సమర్పణ : తమ్మారెడ్డి భరద్వాజ

బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్ 

 

రక్షిత్, నక్షత్ర జంటగా వచ్చిన సినిమా పలాస. 1978లో పలాసలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పటికే సెలబ్ర్తీస్ అందరు ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. 

 

కథ :

 

పలాసలోని మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) ఇద్దరు అన్నదమ్ములు సరదాగా జీవితాన్ని సాగిస్తుంటారు. ఎంతో ప్రేమాభిమానాలతో ఉండే ఈ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతారు మరో ఇద్దరు. అదే ఊరిలో ఉండే పెద్ద షావుకారి, చిన్న షావుకారి. షావుకారి అన్నదమ్ముల మధ్య గొడవలకు మోహన్ రావు, రంగారావు ల మధ్య గొడవ అవుతుంది. కళని నమ్ముకున్న ఆ అన్నదమ్ముల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..? చివరకు అన్నదమ్ములు ఏమయ్యారు..? అన్నది సినిమా కథ.

 

విశ్లేషణ :

 

పలాస 1978.. ఈ సినిమా కథ రొటీన్ గా అనిపించినా కథనం విషయంలో దర్శకుడు తన ప్రతిభ కనబరిచాడు. శ్రీకాకుళం పల్లెల్లోని జీవన విధానాలను అక్కడ యాసని దర్శకుడు చక్కగా చూపించాడు. అంతేకాదు అగ్ర పేద వర్ణాల  గురించి దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. 

 

తమ అవకాసరాల కోసం పేద వర్ణాల కులస్తులని వాడుకోవడం.. వీరి స్వార్ధం కోసం వాళ్ళల్లో వాళ్లకు గొడవలు పెట్టడం లాంటి విషయాలను చాలా క్లియర్ గా ప్రస్తావించాడు దర్శకుడు కరుణ కుమార్.  సినిమా ఫస్ట్ హాఫ్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మొదలైన కొద్దిసేపటికే పాత్రలకు ఆడియెన్ కనెక్ట్ అవుతాడు. ఇంటర్వల్ కూడా బాగా సెట్ అయ్యింది.

 

సినిమా గ్రిప్పింగ్ విషయంలో పర్వాలేదు అనిపించినా దర్శకుడు సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సినిమా కోసం దర్శకుడు పడిన కష్టం తెర మీద కనిపిస్తున్నా రొటీన్ కథ అవడంతో ప్రేక్షకులు నిరుత్సాహ పడతారు. కథ పాతదే అయినా కథనం విషయంలో దర్శకుడు తన మార్క్ చూపించాడు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కన్నా మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది.

 

నటీనటుల ప్రతిభ :

 

మోహన్ రావు పాత్ర చేసిన రక్షిత్ బాగానే చేశాడు. కొన్ని సీన్స్ లో కొత్త కుర్రడైనా చాలా బాగా చేసినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ నక్షత్ర తన నటనతో మెప్పించింది. తిరువీర్ నటన ఆకట్టుకుంది. రఘు కుంచె నటన ఇంప్రెస్ చేసింది. ఆటను ఆర్టిస్టుగా కొనసాగించవచ్చు. మిగతా వారంతా కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో చాలామంది కొత్త నటీనటులు కనిపిస్తారు.

 

సాంకేతికవర్గం పనితీరు : 

 

ఆరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. 1978 నాటి లోకేషన్స్.. కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కూడా రఘు కుంచె బాగానే ఇచ్చాడు. కథ పాతదే అయినా కథనంలో డైరక్టర్ కరుణ కుమార్ తన మార్క్ చూపించాడు. స్టోరీ టెల్లింగ్ లో అతనికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ : 

 

నటీనటుల ప్రతిభ 

కథనం

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్ :

 

రొటీన్ స్టోరీ

అక్కడక్కడ ల్యాగ్ అవడం

యాక్షన్ సీన్స్ 

 

బాటం లైన్ :

 

పలాస 1978.. మెప్పించే ప్రయత్నమే కాని..!

 

రేటింగ్ : 2.5/5

 

మరింత సమాచారం తెలుసుకోండి: