తుఫాను, వరదలు వంటి విపత్తులు వస్తే ప్రభుత్వం బాధ్యతతో తక్షణ సాయం అందిస్తుంది. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర కాబట్టి. అదే విధంగా వివిధ రంగాల్లోని ప్రముఖులతో పాటు ప్రజలు కూడా స్వచ్చందంగా విరాళాలు అందించడం చేస్తూంటారు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో అందరి చూపు సినిమా వాళ్లపైనే ఉంటుంది. తమ అభిమాన హీరోలు ఎంత డొనేట్ చేశారు.. అసలు ఇస్తారా లేదా అనే లెక్కలు ఉంటాయి. అనేక సమయాల్లో టాలీవుడ్ హీరోలు తమవంతు సాయం చేశారు. కానీ వీరిలో పవన్ కల్యాణ్ చేస్తున్న సాయం ప్రత్యేకంగా ఉంటోంది.

IHG

 

కొన్ని విపత్కర సమయాల్లో పవన్ కల్యాణ్ చూపించే వితరణ సినీ వర్గాలనే కాకుండా రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. హుద్ హుద్ తుఫాను వచ్చిన సమయంలో ఏకంగా 50లక్షలు విరాళం ప్రకటించాడు. రీసెంట్ గా సైనిక సంక్షేమ నిధికి కూడా 1కోటి రూపాయల చెక్ అందించాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ లో కూడా కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి మద్దతుగా భారీ మొత్తంలో 2కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ప్రధాని సహాయనిధికి 1కోటి రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి 50లక్షల విరాళం ప్రకటించాడు.

IHG

 

ఇంత భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం ఎవరినైనా షాక్ కు గురి చేసేదే. అందరికీ దేశభక్తి ఉండాలనే కాకుండా జాతీయ సమైఖ్యత ఉండాలని చెప్పే పవన్ లో ఈ గుణం ఆయన మాటలకు చేతల రూపిమిస్తోందనే చెప్పాలి. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే నటులు తమ వంతు విరాళం ప్రకటించినా పవన్ వారందరికంటే ఎంతో ఎత్తులో ఉంటున్నాడు. పవన్ లోని నిజాయితీని గొప్పగా చెప్పుకునే ఆయన అభిమానులకు పవన్ ఆదర్శంగా ఉంటున్నాడని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: