స్మాల్ స్క్రీన్ పై మేల్ యాంకర్ గా సూపర్ క్రేజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు తన కెరియర్ లో కొత్త స్టెప్ వేశాడు. హీరోగా ప్రదీప్ చేస్తున్న తొలి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? మున్నా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. అసలైతే ఈపాటికి సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడాల్సి వచ్చింది. మార్చ్ 25 ఉగాది రోజు నాని వి సినిమాతో పాటుగా ప్రదీప్ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. 

 

కానీ లాక్ డౌన్ కారణంగా సినిమాలు, షూటింగులు, రిలీజ్ లు ఆపేశారు. అయితే ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతున్నా లేక ఎత్తేస్తారా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయిదు ఏప్రిల్ చివరి వరకు ఇలా ఉన్నా మార్చ్ 25 నుండి ఆల్రెడీ ఏప్రిల్ లో రిలీజ్ షెడ్యూల్ వేసుకున్న సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ సినిమాల రిలీజ్ డేట్స్ కచ్చితంగా క్లాష్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న సినిమాలు సోలిగా వస్తేనే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రదీప్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా కాబట్టి సోలోగా రావాలి లేదంటే పోటీలో కొట్టుకుపోవడం ఖాయం. 

 

చేయక చేయక సినిమా చేస్తే ఆ సినిమా రిలీజ్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం ప్రదీప్ ను టెన్షన్ లో పడేశాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈపాటికి రిలీజ్ అవ్వాల్సిన ఆ సినిమా మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం నిర్ణయించలేదు. ఆల్రెడీ ఏప్రిల్ 2, 10, 17 ఇలా అన్ని డేట్స్ ను ఫీల్ చేశారు. కానీ ఇప్పుడు అవేమి రిలీజ్ అవ్వట్లేదు. మరి ప్రదీప్ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: