సుధీర్ బాబు పెర్ఫార్మన్స్ , హరి సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , మనసును టచ్ చేసే కొన్ని ఎపిసోడ్స్ సుధీర్ బాబు పెర్ఫార్మన్స్ , హరి సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , మనసును టచ్ చేసే కొన్ని ఎపిసోడ్స్ స్లో నేరేషన్ , సాంగ్స్ ప్లేస్ మెంట్ , ప్రాపర్ జస్టిఫికేషన్ లేకపోవడం , ఊహాజనితమైన స్క్రీన్ ప్లే , రెగ్యులర్ స్టొరీ , నో ఎంటర్టైన్మెంట్ , ఎడిటింగ్

కృష్ణాపురంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్న తమ ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడో గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్నారని పేపర్ లో చూసి తెలుసుకున్న ఆ ఊరి ఫ్రెండ్స్ శీను, చందు, జిలాని, గంగాధర్ కలిసి గెట్ టుగెదర్ ఫంక్షన్ ని ఏర్పాటు చేస్తారు. ఆ ఫంక్షన్ కోసం అమెరికాలో సెటిల్ అయిన కృష్ణ(సుధీర్ బాబు) ఇండియా బయలు దేరుతాడు. అలా ఇండియా వచ్చి హైదరబాద్ నుంచి కృష్ణాపురం జర్నీ మొదలు పెట్టిన కృష్ణ తన గతాన్ని, తన గతంలోని ప్రేమని చెప్పడం మొదలు పెడతాడు. కృష్ణ చిన్నతనంలోనే తన స్కూల్ లో చేరిన రాధని చూసి ప్రేమలో పడతాడు. చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా కలిసి పెరుగుతారు. కాలేజ్ టైంలో ప్రిన్సిపాల్ పోసాని కృష్ణ మురళి వలన రాధ తనని ప్రేమించడం లేదని, చదువుకునే వయసులో ప్రేమకంటే కెరీర్ చాలా ముఖ్యం అని తెల్సుకొని కెరీర్ లో బాగా సక్సెస్ అవుతాడు. అప్పుడు రాధ కోసం వెళ్తాడు కానీ అప్పుడు రాధ వాళ్ళ అమ్మ అడ్డుపడడం వలన తన ప్రేమని చెప్పకుండా వెనక్కి వచ్చేస్తాడు. ఫైనల్ గా ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో రాధకి తన ప్రేమని చెప్పాలని కృష్ణ వస్తాడు కానీ రాధ రాదు. రాధ ఎందుకు రాలేదు.? రాధ రాకపోవడంతో కృష్ణ ఏం చేసాడు.? రాధ - కృష్ణలు చివరికి కలిసారా.? లేదా అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.  

ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు ఉన్నా ఎక్కువ భాగం సినిమా మాత్రం సుధీర్ బాబు - నందితల చుట్టూనే తిరుగుతుంది. సుధీర్ బాబు కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. సుధీర్ బాబు ఇందులో మూడు డిఫరెంట్ వేరియేషన్స్(ఇంటర్ లైఫ్, బి టెక్ లైఫ్ అండ్ కెరీర్ లో సెటిల్ అయ్యాక) ఉన్న పాత్రలో నటించాడు. ప్రతి ఒక్క పాత్రలోనూ లుక్ విషయంలో మరియు పెర్ఫార్మన్స్ పరంగా ఎంతో వైవిధ్యాన్ని చూపాడు. అంతే కాకుండా ప్రతీ ఎపిసోడ్ లోనూ ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఆ ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు. ఎమోషనల్ గా సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక ఎప్పటిలానే పాటల్లో డాన్సులతో ఆకట్టుకున్నాడు. నందిత చూడటానికి చాలా బాగుంది అలాగే ఇచ్చిన పాత్రలో బాగానే నటించింది. పోసాని కృష్ణ మురళి, చైతన్య కృష్ణ, గిరిబాబు, రఘుబాబు తమకిచ్చిన చిన్న పాత్రల్లో డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మిగతా నటీనటులు ఉన్నంతలో బాగానే చేసారు. 

చిన్నప్పటి నుంచి పెద్దలు మనకు ఒక సామెత చెబుతుంటారు అదే 'తల్లి తండ్రి గురువు దైవం' కానీ ఇందులో 'తల్లి తండ్రి గురువు ప్రేమ' అనే పాయింట్ ని చెప్పారు.. తల్లి తండ్రులు మనకు జమనిస్తే మనల్ని సక్రమమైన మార్గంలో నడిపించేలా చేసేది మాత్రం గురువు.. ఆ గురువు చెప్పిన లక్ష్యాన్ని సాధించాలి అంటే దానికి స్ఫూర్తి ప్రేమ అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చాలా బాగా చెప్పారు.. ఇక సినిమా విషయానికి వస్తే.. 2013లో కన్నడలో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అక్కడ ట్రెండ్ సెట్ చేసిన సినిమా చార్మినార్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సినిమా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ఈ సినిమాలో తల్లి తండ్రులు, గురువులు, ఫ్రెండ్స్, ప్రేమ మరియు లక్ష్య సాధన అనేవి ఒక మనిషి జీవితంలో ఎంత ప్రధానం అనే పాయింట్ ని తీసుకొని ఈ సినిమా చేసారు. ఈ పాయింట్ ని తెలుగులో మానం ఇప్పటికే పలు సినిమల్లో చూసమనే చెప్పాలి. కావున కథా పరంగా మనకు ఎక్కడా పెద్ద కొత్తగా అనిపించదు. జస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ఓ చన్న ట్విస్ట్ మాత్రమే డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ సినిమాలో డైరెక్టర్ చందు చేసిన తప్పు ఏంటి అంటే కథనం మరియు నేరేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఇలాంటి సినిమాలలో ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి ఎలాగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.. కానీ ఓవరాల్ గా సినిమా బాగుండాలి అంటే అవి పర్ఫెక్ట్ ప్లేస్ లలో పడడటమే కాకుండా సినిమా ఫ్లో కూడా బాగుండాలి. సీన్స్ విషయంలో డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు, ఎగ్జిక్యూట్ చేసాడు. కానీ అన్నిటికీ కంటిన్యూగా ఉండే కనెక్టివిటీని మిస్ అయ్యాడు. దానికి కారణం కథనం విషయంలో సరైన కేర్ తీసుకోకపోవడం అలాగే నేరేషన్ సినిమా మొదటి నుంచి చివరి వరకూ చాలా స్లోగా ఉంటుంది. దానికితోడు పాటలు ఎక్కువ అయిపోయాయి. అంతే కాకుండా ఆ సాంగ్స్ సినిమా వేగాన్ని ఇంకా తగ్గించడమే కాకుండా, సీన్స్ కి సీన్స్ కి మధ్య కనెక్షన్ ని కట్ చేసేలా ఉన్నాయి. అలాగే డైరెక్టర్ చంద్రు చేసిన మరో మిస్టేక్ ఈ కథని పర్ఫెక్ట్ గా తెలుగు నేటివిటీకి, ప్రస్తుత పరిస్థుతులకు సరిగా సింక్ చేయలేకపోయాడు. ఈ స్క్రిప్ట్ ని ఎప్పుడు ఎమోషనల్ సీన్స్ తోనే కాకుండా కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. అలాగే డైరెక్టర్ చేసిన మరో పెద్ద తప్పు కృష్ణ - రాధల మధ్య లవ్ స్టొరీని ప్రోపర్ గా డిజైన్ చేసుకోకపోవడం. ఉదాహరణకి సినిమా మొదటి నుంచి హీరో హీరోయిన్ ని లవ్ చేస్తుంటాడు కానీ హీరోయిన్ మాత్రం జస్ట్ ఫ్రెండ్ లానే చూస్తుంది. కానే క్లైమాక్స్ లో ఒక్కసారిగా ఇద్దరి మధ్యా ప్రేమ ఉందని చూపిస్తారు. ఈ పాయింట్ ని సరిగా జస్టిఫై చెయ్యలేదు. ఇలాంటి మిస్టేక్స్ వలన సూపర్ గుడ్ ఫీలింగ్ మూవీగా నిలవాల్సిన సినిమా జస్ట్ కొన్ని సీన్స్ వరకు మాత్రమే ది బెస్ట్ అనిపించుకోవాల్సి వచ్చింది.


ఇక మిగతా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే హరి అందించిన మ్యూజిక్ ఈ చీనెమాకి ప్రధాన హైలైట్. అతను కంపోజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయి కానీ ప్లేస్ మెంట్ సరిగా లేదు. అదిపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో పెద్ద హైలైట్. సీన్స్ లో ఉన్న ఫీల్ ని తన మ్యూజిక్ తో ఆడియన్స్ కి కనెక్ట్ చేసారు. కెఎస్ చంద్ర శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది, ముఖ్యంగా కర్ణాటక వాటర్ ఫాల్స్ దగ్గర చేసిన సీన్స్ సూపర్బ్. ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఓకే. ఎడిటర్ రమేష్ కొల్లూరి ఈ సినిమాని చాలా వరకూ ఎడిట్ చేసి ఉంటే ఈ సినిమా వేగం పెరికి ఇంకాస్త బెటర్ ఫీల్ వచ్చేది. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ నీర్మాన విలువలు సూపర్బ్. 

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సినిమా 'ప్రేమ' అనే పదానికి అచ్చమైన నిర్వచనం చెప్పడానికి చేసిన ఓ చిరు ప్రయత్నం. అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పగలిగి ఉంటే టాలీవుడ్ లో మరువలేని మరియు మనసుకు హత్తుకునే ఓ ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా నిలిచిపోఎది. కానీ డైరెక్టర్ తెలుగు నేటివిటీకి సరిగా కనెక్ట్ చేయలేకపోవడం, అనుకున్న పాయింట్ కి 100% జస్టిఫికేషన్ చేయలేకపోవడం వలన.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా కొన్ని సీన్స్ పరంగా మాత్రమే ఫీల్ గుడ్ అనిపించుకుంది. ఈ సినిమాలో చైల్డ్ హుడ్ ఎపిసోడ్, పోసాని ఎపిసోడ్స్, సన్ - మదర్ సెంటిమెంట్ ఎపిసోడ్స్, గెట్ టుగెదర్ మీటింగ్, క్లైమాక్స్ సీన్స్ కచ్చితంగా మీ మనసుకు హత్తుకుంటాయి. కానీ ఈ సీన్స్ అన్నిటికీ మధ్యలో బ్రేక్స్ ఎక్కువ ఉండడం వలన ఆడియన్స్ పూర్తి మూవీని ఫీల్ అవ్వలేకపోయారు. ఓవరాల్ గా కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా అస్సలు బాగాలేదు అని చెప్పలేం,, ఓకే బాగానే ఉంది కానీ ఈ సినిమాని ఇంకా బాగా తీసే అవకాశం ఉంది, అలా తీసి ఉంటే సుధీర్ బాబు కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచేది.. తీయకపోవడం వలన ఆ ఛాన్స్ మిస్ అయ్యింది.  

Sudheer Babu,Nanditha,R. Chandru,Lagadapati Sridhar,Hari.పంచ్ లైన్ : కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ - కలిపింది కానీ ఆడియన్స్ ని కలుపుకోలేక పోయింది.!

మరింత సమాచారం తెలుసుకోండి: