సినిమాటోగ్రఫీ ,సంగీతం ,బేసిక్ ప్లాట్ ,కొన్ని సన్నివేశాలలో డైలాగ్స్ ,నటీనటుల పనితీరు.సినిమాటోగ్రఫీ ,సంగీతం ,బేసిక్ ప్లాట్ ,కొన్ని సన్నివేశాలలో డైలాగ్స్ ,నటీనటుల పనితీరు.రెండవ అర్ధ భాగంలో కథనం ,సందర్భం అంటూ లేని కామెడీ ,ఎడిటింగ్ ,దర్శకత్వం,ప్రాస కోసం పెట్టిన పరుగు

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు కార్తిక్(ఆది) మరియు శ్వేత(ఎరికా ఫెర్నాండెజ్) మొదట్లో కొద్ది రోజులు బాగానే గడిచినా మెల్లగా వీరి మధ్య గొడవ మొదలవుతుంది. అలాంటి ఒక గొడవ జరుగుతున్న సమయంలో వీరు తమ తమ గతాల గురించి బయటపడిపోతారు. గతంలో కార్తీక్, పరిణీతి(క్రిష్టినా అఖీరవా) అనే అమ్మాయిని ప్రేమించి ఉంటాడు కాని కొన్ని కారణాల మూలాన వీరిద్దరూ కలవారు అదే సమయంలో శ్వేతని కూడా గతంలో ఆరవ్ రెడ్డి(రాహుల్ రవీంద్రన్) ప్రేమించి ఉంటాడు కాని శ్వేత పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటుంది. ఇలా ఒకరి గతం మరొకరికి తెలియగానే ఇక కలిసి ఉండలేము అని నిర్ణయించుకొని కార్తీక్ మరియు శ్వేతలు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.. అసలు కార్తీక్ ,పరిణితి మరియు శ్వేత , ఆరవ్ లు ఎందుకు విడిపోయారు? చివరికి స్వ్హేత మరియు కార్తీక్ ల బంధం ఏమయ్యింది? లాంటి ప్రశ్నలకు సమాధానం తెర మీద దొరుకుతుంది..

తన ఎనర్జీతో ఎప్పుడు ఆకట్టుకునే నటుడు ఆది ఈ చిత్రంలోనూ అదే స్థాయి ఎనర్జీ కనబరిచారు. కాని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో అయన నటన పూర్తిగా తేలిపోయింది. కాని ఇటువంటి చిత్రంలో ఇటువంటి పాత్రను ఎంచుకోవాలంటే నిజంగా చాలా ధైర్యం కావాలి ఈ విషయంలో అతన్ని మెచ్చుకొని తీరాల్సిందే.. ఎరికా ఫెర్నాండేజ్ చూడటానికి ఆ పాత్రకు తగ్గట్టు ఉన్నా కూడా కీలక సన్నివేశాల వద్ద ఆ పాత్ర ఎలా అయితే ప్రవర్తించాలో అలాంటి నటన కనబరచలేదు... క్రిష్టినా అఖీరవా నటనాపరంగా అంత గొప్పగా ఆకట్టుకోలేదు అందంపరంగా కొన్ని సన్నివేశాలలో ఆకట్టుకుంది. రాహుల్ రవీంద్రన్ పాత్రలో అతని నటనా ఆకట్టుకోలేదు అతని పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది భరత్ రెడ్డి పాత్రకు తగ్గ నటన కనబరిచారు. గాయత్రి భార్గవి ఉన్న కొన్ని సన్నివేశాలలో తనదయిన మార్క్ వెయ్యగలిగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో బాగా నటించింది. ప్రగతి కనిపించింది రెండు సన్నివేశాలే అయినా ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులందరు తెర మీద కనిపించి వెళ్ళిపోయిన వారే..

కథా పరంగా ఇది కాస్త రొటీన్ గానే సాగినా అది చెప్పిన విధానంలో కాస్త తేడా చూపించారు అంతే కాకుండా కథ ముగించిన విధానం కొత్తగా ఉండటం ఈ చిత్రానికి కొత్తదనం తెచ్చిపెట్టింది. కథనం విషయానికి వస్తే కథని రెండు విభాగాలుగా చేస్తే ఒకటి యూత్ ఆలోచన ధోరణి, వారి ప్రేమ పరిస్థితి ఒకటి అయితే వాటి వలన ఎదురయ్యే పరిణామాలు మరొకటి మొదటి విషయంలో సక్సెస్ అయిన దర్శకుడు నవీన్ గాంధీ రెం డవ విషయంలో చాలా దారుణంగా విఫలం అయ్యారు చివరకి వచ్చేసరికి చెప్పాలనుకున్న పాయింట్ నుండి పక్కకి పోయారు.. కాని చివర్లో ముగించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ అందించిన బుజ్జి లొకేషన్ లను చాలా అందంగా చూపించారు ...భీమ్స్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి అంతే కాకుండా అతని నేపధ్య సంగీతం కూడా అక్కడక్కడా ఆకట్టుకుంది.. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది. మాటలు కొన్ని సన్నివేశాలకు నప్పినా ప్రాస కోసం పెట్టిన పరుగు కొన్ని సన్నివేశాలలో విసుగు తెప్పించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి...

ప్రస్తుతం యూత్ ఎదుర్కుంటున్న సమస్యల మీద పలు చిత్రాలు వచ్చాయి ఇది కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే.. ప్రేమించిన వాళ్ళని కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న జంట ఎదుర్కునే సమస్యల గురించిన కథ ఇది.. నిజానికి వీరి ప్రేమ కథలను చాలా బాగా చూపించిన దర్శకుడు రెండవ అర్ధ భాగంలో పరిణామాలను సరిగ్గా చూపించలేకపోయారు. తెర మీద అన్ని పాత్రలు చాలా క్లియర్ గా క్లారిటీ గా మాట్లాడుతున్న ప్రేక్షకుడు మాత్రం చాలా గందరగోళంలో ఉంటారు. కాని ఎప్పటిలా కాకుండా కాస్త విభిన్న ముగింపు ఇవ్వడం ఈ చిత్రానికి కొత్తదనాన్ని చేకూర్చింది. కాని కామెడీ పేరుతో అనవసరమయిన సన్నివేశాలను కత్తిరించేసి ఉంటె చాలా బాగుండేది. ఇది యూత్ మాత్రమే చూడదగ్గ చిత్రం వారిని ఉద్దేశించి తీసిన చిత్రం.. కాని చివర్లో ఇటు ప్రస్తుత జనరేషన్ కి అటు ముందు జనరేషన్ కి మధ్య వచ్చిన సమస్యకి పరిష్కారం అసలు చూపెట్టలేదు. ఇది క్లీన్ "Y" చిత్రం అంటే యూత్ చిత్రం కాబట్టి.. మీరు మీ స్నేహితులు కలిసి ఒకసారి చూడదగ్గ చిత్రం ...

Aadi,Erica Fernandes,Naveen Gandhi,Sampath Nandi,Bheems Ceciroleo. గాలిపటం - క్లీన్ "Y" చిత్రం ...

మరింత సమాచారం తెలుసుకోండి: